• Maranam Anchuna Mandahasam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మరణం అంచున మందహాసం

    Maranam Anchuna Mandahasam

    Publisher: Surya Prachuranalu

    Pages: 192
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

1942లో మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో జన్మించిన పోల్కంపల్లి శాంతాదేవి గడచిన అర్ధశతాబ్దంగా రచనలు చేస్తున్నారు. రచయిత్రుల యుగంలో నవలా రచన చేసి తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ఘనత దక్కించుకున్న వారిలో శాంతాదేవి ఒకరు. 75 వరకు కథలు, 62వరకు నవలలు రచించారు.

వీరి నవలలు, ప్రముఖ పత్రికల్లో ధారావాహికలుగా ప్రచురితమై బహుమతులను, బహుమతులకు మించిన పాఠకాదరణను తెచ్చి పెట్టాయి. ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైన ‘చండీప్రియ’ సినిమాగా వచ్చింది. మరొక నవల ‘పుష్యమి’, ‘ఆత్మబంధువు’ పేరుతో విజయనిర్మల దర్శకత్వంలో టెలీసీరియల్‌గా ప్రసారమైంది.

శాంతాదేవి రచనలపై ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన జరిగింది. స్త్రీ చైతన్య స్రవంతి పేరుతో సంస్థను స్థాపించి మహిళాభ్యుదయం కోసం వీరు అనేక కార్యక్రమాలను చేపట్టారు. తెలుగు విశ్వవిద్యాలయం ‘రచయిత్రి ఉత్తమ గ్రంథం’ పురస్కారానికి ఎంపికైన నైనా నవల్లో శాంతాదేవి గారిలోని రచయిత్రినీ, సామాజికసేవా పరాయణురాలినీ చూడవచ్చు.

ఈ నవల్లోని ‘నైనా’ ఎంతో ఉదాత్తమైన పాత్ర. సమాజసేవపై అనురక్తిని పెంచుకొని ఆ దిశగా ముందుకు సాగి సేవచేయడం, సాహసంతో చెడును ఎదుర్కోవడం, చెడును రూపుమాపి మంచి మార్గం వైపు మళ్ళించడం వంటి ఎన్నో మంచిపనులు చేస్తుంది నైనా. అభినందన సంస్థవారి నుంచి ‘మాదిరెడ్డి సులోచన స్మారక పురస్కారం’ వంటి గౌరవాలను శాంతాదేవి అందుకున్నారు.

2008 సంవత్సరానికి ‘రచయిత్రి ఉత్తమ గ్రంథం’ విభాగంలో ‘నైనా’ నవలకు సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తూ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తమ పరిచయ పత్రంలో పేర్కొన్న వివరాలు

- సూర్య ప్రచురణలు

Preview download free pdf of this Telugu book is available at Maranam Anchuna Mandahasam