-
-
మనుస్మృతి (తెలుగు తాత్పర్యముతో)
Manusmruti Tatparyamu
Author: Dr. N. L. Narasimhacharya
Publisher: Gayathri Prachuranalu
Pages: 420Language: Telugu
మనుస్మృతి అంటే తెలియని వారు అరుదు. కాని అందున్న విషయాలు తెలిసినవారు చాలా అరుదు. ఇది మానవధర్మశాస్త్రం. మానవులందరూ నడుచుకోవాల్సిన పద్ధతి తెల్పే అతి ప్రాచీన ధర్మశాస్త్రం. ఇది ఋగ్వేద బ్రాహ్మణమైన ఐతరేయ బ్రాహ్మణకాలానికి సమీపంలో రాయబడింది.
జాతకర్మ, నామకరణం (పేరు పెట్టుట), అన్న ప్రాశన, ఉపనయనవిధి (గురువు దగ్గరకు పంపడం), వివాహం మొదలైన విషయాలే కాక, పెండ్లి చేసికొన్నవారు (గృహస్థులు) వానప్రస్థులు (ఒక విధంగా మనశ్శాంతి కోరుకునే వయోవృద్ధులు) ఆచరించాల్సిన విధులు, శ్రాద్ధ నియమాలు మొదలైనవెన్నో ఇందుకన్పిస్తాయి.
పరిపాలకులు చేయాల్సిన న్యాయవిచారణ, ఆస్తి పంపకం, అప్పు ఇచ్చే పద్ధతి, ఉమ్మడి వ్యాపారం, యజమాని సేవకులకు మధ్య తగాదాలు, ఎల్లల మధ్య వివాదం, వస్తువుల మూల్య నిర్ణయం, వాహనాలు ఎక్కి ప్రయాణించేవారి చార్జీలు నిర్ణయించుట, నాణాలు, పన్నులు, కుదువబెట్టుట, దాచి పెట్టుట, జామీను ఇచ్చుట, కమీషన్, కన్సెషన్, వాహనాలున్నవారు తీసికోవాల్సిన జాగ్రత్తలు, కల్తీ చేసి వస్తువులనమ్మేవారిని, లంచాలు తీసికొనేవారిని, మోసాలు చేసేవారిని శిక్షించుట మొదలైనవెన్నో చెప్పబడ్డాయి. ధర్మనిర్ణయాన్ని వ్యక్తి కాక సభ మాత్రమే తీసికొనవలెనని చెప్పబడింది.
ఇది భారతీయ శిక్షాస్మృతికి ఆధారగ్రంథం. నేటికీ వ్యాప్తిలో ఉన్న భారతీయ ఆచారాలకు ప్రధాన మూలగ్రంథం.
ఇక స్త్రీల గురించి... మనువు వారికి స్వాతంత్ర్యమివ్వలేదనే అపవాదు ఉంది. కాని స్త్రీలు ఇంటికి శోభ తెస్తారని, వారిని గౌరవించాలని, వారిని ఎల్లప్పుడు సంతోషపెడ్తూ ఉండాలని, కన్యావిక్రయం కూడడని, స్త్రీ ధనం ఆరు విధాలుగా ఉంటుదని, కొన్నిచోట్ల పురుషుని కంటే స్త్రీయే ప్రధానమైనదని చెప్పినాడు. భర్త చనిపోయి, లేక ఇతర కారణాల వల్ల రెండవ వివాహం చేసికొన్న స్త్రీ గురించి, ఆమె సంతానం గురించి చెప్పినాడు. మేనరికాన్ని మనువు ఖండించినాడు. స్త్రీ పురుషులిద్దరూ వ్యభిచారం చేయవద్దన్నాడు. ఇంకా ఎన్నో...
చారిత్రక దృష్టితో చదివినా దీంట్లో ఎన్నో మణులు, మాణిక్యాలు కన్పిస్తాయి. ఇంత గొప్ప పుస్తకాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేస్తే బాగుండని సంస్కృత శ్లోకాలతో సరళమైన తెలుగు తాత్పర్యాన్ని జత చేసి అందించాను. ఇక పాఠకులదే తరువాతి వంతు.
- డా. ఎన్. ఎల్. నరసింహాచార్య
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
- ₹162
- ₹540
- ₹360
- ₹270
- ₹360
- ₹162
it is not downloading please help
Looking for printed book
vatlururaja@gmail.com
i like
please intimate when printed book is available to us
pavankumar.co.in@gmail.com
Looking for printed book.
please intimate when printed book is available to us.