-
-
మంత్రలిపి
Mantralipi
Author: Konakanchi Laxmi Narasimha Rao
Publisher: Mantralipi Publications
Pages: 224Language: Telugu
Description
నా ఇంటి గుమ్మానికే... నాతలను వేలాడ దీసి
జీవితాన్ని మొత్తాన్ని నడుస్తున్న ఆసుపత్రిని
చేసుకున్నా....
భూమ్మీద ఒక్కడూ.. అయ్యో అని
మాట వరసకైనా.. ద్వేషంతో శపించడేం...?
ప్రతి ఒక్కడూ తన దుఃఖంలో... తనే
తనకు తానే ఓ సముద్రంగా మారినప్పుడు
సేద దీరటానికయినా... కాసింత ఒడ్డునిస్తూ
నాకోసం ఎవరూ పక్కకు జరగరేం?
స్నేహాన్ని నటిస్తూనే...
నాకు తెలియకుండా... నన్ను ఓ ప్లాస్టిక్ పువ్వును చేసి
బ్రతుకు పుస్తకంలో ఉన్న ఆఖరి రక్త మాంసాలని
ఎవరో ఎత్తుకు వెళ్ళి పోయారు.
ఒక భయ భ్రాంతాల్లోంచి... ఒక భయం బోనులోంచి
కొత్త శిశువుగా... బయటి వచ్చినపుడు
స్వేచ్ఛగా నేను నవ్విన నువ్వే...
ఒక మంత్రం... ఒక తంత్రం.
స్వేచ్ఛగా నాకు నేనే.. పూసిన పువ్వే
ఒక చిత్రలిపి... ఒక మంత్రలిపి.
మట్టి మనుషుల సమాధుల్లోంచి...
మరమనుషుల కలల్లోంచి...
పుట్టుకొస్తున్న.. వెయ్యి దీపాల జననమే
ఒక తంత్రలిపి... ఒక మంత్రలిపి
Preview download free pdf of this Telugu book is available at Mantralipi
Login to add a comment
Subscribe to latest comments
