-
-
మంటిదివ్వ
Manti Divva
Author: Siriki Swami Naidu
Publisher: Sneha Kala Sahiti
Pages: 106Language: Telugu
ఇది సిరికి స్వామినాయుడి మొదటి కవితా సంపుటి. ఈ సంపుటిలోణి కవిత్వమంతా నిర్దిష్టమైనదే. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలకో, ప్రజల పోరాటలకో, గిరిజన తిరుగుబాటుకో రాజ్యం హింసావిధానానికో స్పదించి రాసినవే ఎక్కువ. ఈ కవిత్వంలోని వస్తువు కవి చుట్టూ అల్లుకున్నదే. తన పల్లెవాసులు అనుభవిస్తున్నదే.
ఈ కవితా సంపుటిలో వున్న కవితలన్నీ - చాలా మాములు సమస్యల్నుంచి చాలా సంక్లిష్టమైన సమస్యల దాకా - ఆ సమస్యలు సృష్టించిన జీవన సంక్షోభం శిధిలత్వం, పరాయితనం, విచ్ఛిత్తి - వంటి అంశాలతో అల్లినవే.
- కె. శివారెడ్డి
ప్రపంచీకరణ గురించి చెప్పినా.... ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ గురించి రాసినా... పవర్ప్లాంట్ల గురించి అయినా.... మరోదాన్ని గురించి అయినా..... కవిత్వం చెప్పడంలో స్వామినాయుడికి తన నేల మీద గల మమకారం వ్యక్తం అవుతోంది. తన ప్రజల పట్లగల ప్రేమ స్పష్టమౌతోంది.
- గంటేడ గౌరునాయుడు
