• Manoprastanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనోప్రస్థానం

    Manoprastanam

    Pages: 148
    Language: TELUGU
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

2003 తానా నవలల పోటీలో రూ.25000/- పొందిన ఏకైక నవల "మనోప్రస్థానం"

* * *

ఈ నవలలోని కథానాయకుడ్ని నేనే! నా చిన్నతనంలో మా నాన్న చనిపోయారు. అప్పట్నుంచి నాకు మృత్యువంటే భయం. మానవులు ఎప్పటికయినా 'మృత్యువుని' భౌతికంగా జయించాలనేది నా ఆశ - ఆరాటం. ఏదో ఒకరోజు మానవులు మృత్యువుని జయిస్తారు. అప్పటికి నేను ఉండను. ఉండనవసరం లేదు. మనుషులుంటారు. అందమైన ఈ ప్రపంచం వుంటుంది. మృత్యువుతో పాటు వాళ్ళు అంతరాలను జయిస్తారు. రచయితల్లో వుండే లక్షణాలు నాలోనూ వున్నాయి. నన్ను కావాలని తప్పుగా ఇంటర్‌ప్రెట్ చేస్తే బోల్డంత ఆగ్రహం. రచనలు చదివి కన్నీళ్ళు పెట్టుకోవడం, 'అజాదన్నా' అని యువ రచయితలు పిలుస్తుంటే వెర్రి ఆనందం, డాక్టర్లూ, చిత్రకారులూ, సీనియర్ రచయితలూ నన్ను దీవిస్తున్నప్పుడూ, నాతో స్నేహిస్తున్నప్పుడూ చిన్న పిల్లాడిని కావటం.

కథ - నవల - కవిత్వం - విమర్శ - కాలమ్ - రేడియో - టివి - సినిమా - నటన ఇన్ని పనులు ఎలా చేస్తున్నావ్ అని చిన్ననాటి మిత్రులడుతుంటే గర్వం. నా రికార్డులు బద్దలు కొట్టే యువతరం కోసం నిరీక్షణ. ఇన్ని రాస్తున్నా నేను ఏ సాహితీ సంస్థలోనూ సభ్యుడ్ని కాదు కాబట్టి నన్ను గుర్తించనట్లు నటించేవాళ్ళను చూసి 'ఐ డోంట్ కేర్' అనుకోడం, నాకిప్పుడు ఏభై సంవత్సరాలు వచ్చాయి. నేనెప్పుడూ నా పాఠకుల్నే నమ్మాను. వారికే నమస్కరిస్తాను. అన్నట్లు 2003లో ఈ నవలకి తానా వాళ్ళు ఓ పాతికవేలిచ్చారు. నేను కలల వ్యాపారిని. అదే నా బలమూ -బలహీనతా. మళ్ళీ చెబుతున్నాను మనం మృత్యువుని జయిద్దాం.

- చంద్రశేఖర్ ఆజాద్

Preview download free pdf of this TELUGU book is available at Manoprastanam