-
-
మనో యజ్ఞం 2
Mano Yagnam 2
Author: Suryadevara Rammohana Rao
Publisher: Model Publications
Pages: 256Language: Telugu
న్యూయార్క్... ఫోన్ మోగగానే రిసీవర్ అందుకున్నాడు ఆ వ్యక్తి. ''నేనే ధనుంజయ్‌ని సార్.. ..మీరు చెప్పినట్లుగా అందర్నీ నావేపు తిప్పుకున్నాను. ఇప్పుడు నన్నేం చేయమంటారు?'' అడిగాడు ధనుంజయ్.
''ఇలాంటి విషయాలు ఫోన్లో చర్చించడం మంచిది కాదని నీకు చాలా సార్లు చెప్పాను. గెస్ట్‌హౌస్‌కి రా... రాత్రి పది గంటలకు... నీకోసం ఎదురు చూస్తుంటారు....'' ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి.
సమయం రాత్రి ఏడుగంటలు... న్యూయార్క్ నగరంలో ఫారెస్ట్ హిల్స్, క్వీన్స్. 67వ రోడ్లో వున్న 9945. బర్కిలీ అపార్ట్మెంట్స్.
కారు దిగి లోనికి నడిచాడు ధనుంజయ్.
అప్పటికే ఆ వ్యక్తిఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ, ధనుంజయ్ లోనికి రాగానే సంభాషణ సగంలో వుండగానే ఆ ఫోన్‌ని కట్ చేశాడు.
ధనుంజయ్ ఆ సమయంలో రోషంగా, ఉద్వేగంగా వున్నాడు.
''మీరు చెప్పినట్టల్లా చేశాను... ఇప్పుడు ఏమైంది... రోజురోజుకీ ఆ శతానంద అధికారం, బలం పెరిగిపోతోంది తప్ప, ప్రత్యేకించి నాకేం జరగడం లేదు.. నా చెల్లెల్ని మేనేజింగ్ డైరెక్టర్ని చేసి, నేను ఏమీ చెయ్యలేని పరిస్థితిని కల్పించాడు ఆ శతానంద....'' నిరాశగా అసహనంగా అన్నాడతను.
