-
-
మన్నెం శారద కథలు
Mannem Sarada Kathalu
Author: Mannem Sarada
Publisher: J.V.Publications
Pages: 448Language: Telugu
Description
కొంచెం నిజం, కొంత కల్పితం కలిపి చెబితే కథ. రంగుల మేళవింపు చిత్రలేఖనానికి ఎంత ముఖ్యమో, వాస్తవ కల్పిత భావాల కలనేత కథారచనకి అంతకన్నా ఎక్కువ ముఖ్యం. కలం, కుంచెలతో సవ్యసాచిత్వం నెరపే శారదకు ఆ మెళకువలు బాగా తెలుసు. అందుకే ఆమె కథలన్నీ చిత్రరచనలే చిత్రాలన్నీ కథలే! భావుకత, భావావేశం కలిస్తే శారద కథలు. దుర్గమమైన మానవజీవన వైరుధ్యాల ‘మన్నెం’లో మనుగడకు మహాభాస్యం చెప్పిన కథలు శారదవి.
‘ఇది కథ కాదు’తో మొదలై ‘విరిగిపడని శిఖరం’దాకా బతుకులోని ఉత్థాన పతనాలను గణనీయంగా గ్రాఫ్ చేసిన కథనాలు పాఠకుల్ని కట్టిపడేస్తాయి. ఒక సంఘటన అదెంత చిన్నదైనా, జరిగిన తర్వాత, అది జరిగిందన్న జ్ఞాపకం మాసిపోయినా దాని ఆటుపోటులు ఆసాంతం. అనుభవించక తప్పదని చెప్తాయి ఈ సంపుటిలోని చాలా కథలు.
- కె.బి. లక్ష్మి
Preview download free pdf of this Telugu book is available at Mannem Sarada Kathalu
Login to add a comment
Subscribe to latest comments
