-
-
మనిషినై మళ్ళీ మొలకెత్తుతా
Manishinai Malli Molakettuta
Author: Dr. Addanki Srinivas
Publisher: Amaravathi Publications
Pages: 88Language: Telugu
ఈ కవితా సంపుటిలోని అభివ్యక్తిలో ఆధునికత్వం. ఆలోచనలో సాంప్రదాయికత కనిపిస్తుంది. ఎన్నుకున్న రూపకాలు ప్రతీకలు స్వీయ మూలాల నుంచి వెలికి వచ్చాయి.
'స్పాంటినిటీ ఇమాజినేషన్' అన్నవి కవితాభివ్యక్తికి మూలాలు. వీటిని తెలుగులో 'స్వచ్ఛంద భావనాశక్తి' అనవచ్చు. కరోనా కవిత్వంలో నేను గమనించినంతవరకు స్పాంటినిటీకే ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది. టీవీలలో కళ్ళముందు దృశ్యాలు దృశ్యాలుగా కదులుతున్న సన్నివేశాలు, ధ్వని తరంగాలతో చేరుతున్న వార్తలు కవిని కుదురుగా ఉండనివ్వని స్థితికి తీసుకు వెళ్లి ఉద్విగ్నభరితుడిని చేశాయి. అందుకే ఈ కవితా సంపుటిలోని కవితలు స్పాంటినిటీతో ఉన్నాయి. బహుశా ఈ కవితా సంపుటిలోని ఈ స్వచ్ఛంద లక్షణమే మనిషిగా మళ్లీ మొలకెత్తేందుకు ప్రేరణను ఇస్తుంది. మనిషి తన లోపాలను దిద్దుకొని ఎదిగితే వ్యవస్థ లోపాలు దానికవే దూరమవుతాయని ధైర్యాన్ని ఇస్తుంది ఈ కవితా సంపుటి.
- సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి
