• Manishi Lohalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనిషి - లోహాలు

    Manishi Lohalu

    Pages: 87
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“మనిషి- లోహాలు” (Man and Metals) అనే ఈ పుస్తకం కథల సంపుటీ కాదు. నవలాకాదు. ఎలాంటి పాత్రలు లేవు. కాని రోజూ మనం వాడుకునే కొన్ని పాత్రలు మాత్రం ఇందులో పాలుపంచుకున్నాయి.

వాతావరుణ కాలుష్యాన్నికలిగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల వాడకాలను అరికట్టాలనే నినాదాలు ఈ రోజుల్లో ప్రపంచమంతటా వినిపిస్తున్నాయి. మరి వీటికి ప్రత్యామ్నాయాలు ఏమిటని ఆలోచిస్తే, ఇవి రాకపూర్వం మన పూర్వీకులు వాడిన లోహ వస్తువులే స్ఫురణకు వస్తాయి. లోహాలతో చేసిన వస్తువుల వాడకం వల్ల ఇటు కాలుష్యాన్ని తగ్గించవచ్చు, అటు మన ఆరోగ్యాలను కూడ పెంచుకోవచ్చు.

అలాంటి లోహాలయొక్క ప్రాముఖ్యత, వాటిలోని రకాలు మొదలైన విషయాలతో ప్రారంభించాను. తరువాత ప్రధానమైన ఇనుము, ఉక్కుల ఉత్పత్తి, వాటి వివిధ ప్రాడక్టుల ఉపయోగాలు మరియు రాగి, బంగారం, వెండి లాంటి, మనం రోజూ వాడుకొనే కొన్ని ముఖ్యమైన లొహాల వాడకం, వాటి ముఖ్య ధర్మాలు, ప్రయోజనాలు, అందులోని రకాలు, అవి మనకు చేసే మేలు, వాటి వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైన సంగతుల గురించి ఈ పుస్తకంలో తెలుపే ప్రయత్నం చేసాను.

ఈ పుస్తకం సాధారణ పాఠకులకు, మనం వాడుకునే లోహపు వస్తువుల గురించి ఒక మంచి అవగాహన కలిగిస్తుంది, లోహశాస్త్రంలో ఆసక్తిఉన్నవారికి, విద్యార్థులకు, టీచర్లకు ఉపయోగంగా ఉండేందుకు గాను కొన్ని సాంకేతిక విషయాలను, చిత్రపటాలను కూడ ఇందులో పొందుపరచటము జరిగింది. ఇది అందరికీ ఉపయోగకారిగా ఉంటుందని ఆశిస్తున్నాను.

- నెల్లుట్ల శ్రీనివాసులు

Preview download free pdf of this Telugu book is available at Manishi Lohalu