-
-
మనిషి జాడ
Manishi Jaada
Author: M.V. Rami Reddy
Pages: 89Language: Telugu
Description
"ఆ నేలపై కాలు మోపినప్పుడు
నిలువెల్లా పులకింత.
జలపాతపు తుళ్ళింత.
నా ఊరు, నేను
పుట్టి పెరిగిన ఊరు.
రక్తమాంసాలు
రాజేసి, నాకో
రూపునిచ్చిన ఊరు.
శరీరంలో గుట్టుగా
సుగంధ ద్రవ్యాల్ని
భద్రపరిచిన ఊరు"
* * *
"దారంట పరిమళాల్ని
ఆస్వాదించడం మరవొద్దు
ఉయ్యాలల్లో పసిపిల్లల బోసినప్పులుంటాయి
ఆకులు, అలముల థింసా నృత్యాలుంటాయి
వరికళ్లాల మధ్య కొడవళ్ళ సయ్యాటలుంటాయి
గేదెల్ని మలేసే కుర్రాళ్ళ
'జెండాపై కపిరాజు' పాటలుంటాయి
చీకటి అధ్యాయాల్ని నెత్తిన మోస్తున్న
పండుటాకులుంటాయి
దేన్నీవొదలద్దు
నిన్ను నువ్వు విప్పుకొని
అన్నిటినీ లోపలికి పిండుకో
నీ లోపలొక వెన్నెల మైదానం విస్తరిస్తుంది"
- ఎమ్వీ రామిరెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Manishi Jaada
Login to add a comment
Subscribe to latest comments
