-
-
మణిమహేష్ - మరి తొమ్మిది
Manimahesh Mari Tommidi
Author: Dasari Amarendra
Publisher: Alambana Prachuranalu
Pages: 128Language: Telugu
ఇంజనీరింగ్ చదువుతోన్న ప్రధి అడిగాడు “ఎన్నెన్నో ట్రెక్కింగులు చేసారు గదా. అందుకు ప్రేరణ ఏమిటి? ఏం ఆశిస్తూ ఉంటారు?” ఆలోచనలో పడ్డాను. “కారణాలు నాలుగు.. అద్భుతమైన ప్రకృతి. నాలోకి నేను చూసుకొనే అవకాశం. పదిమందినీ కలిసి తెలుసుకొనే అవకాశం. నా మానసిక, భౌతికశక్తులను పునర్నిర్వచించుకొనే అవకాశం..”
- మణిమహేష్...
***
కళింగపట్నం నేను ఏ మాత్రమూ ఊహించని అద్భుత సౌందర్యంతో దిగ్భ్రమ కలిగించింది! అటునుంచి ఇటు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర సముద్రతీరం.. అలజడి చెయ్యని అలలు.. ఉండీలేని యాత్రికులు.. జేగురురంగు ఇసుకను మృదువుగా తాకుతోన్న నీలపు సముద్రజలాలు.. స్ఫుటంగా కనిపిస్తోన్న సాగరసంగమం దృశ్యం.. దూరాన క్షితిజరేఖ దగ్గర నీలాల నీటిలో లీనమయిపోతోన్న వినీల ఆకాశం... అసలు మనిషి బ్రతకవలసింది ఇలాంటి చోటునగాదూ? అప్రయత్నంగా భీమ్లీ దగ్గర కనిపించే గోస్తనీనది సంగమ దృశ్యం గుర్తొచ్చింది.
- ప్రయాణాల రహస్యం...
***
గమ్యం చేరాం. ఆటో దిగి వందనోటు అందించాను. ఒక ఏభై మరో పది ఉన్నచెయ్యి ముందుకు సాచాడు. నాలో ఉందని నాకే తెలియని ప్రావీణ్యంతో పెద్దనోటు మాత్రం అందుకొని చిన్ననోటును ఆ అపురూప హస్తంలోనే ఉంచేశాను. ఏదో అనబోయాడు. అర్థమయ్యి సన్నటి చిరునవ్వు. ఆటో తిప్పుకొన్నాడు.
- వాళ్ళు...
***
సిమ్లా పరిసరపు అడవుల్లో నడక... కురుస్తా కురుస్తానంటోన్న వాన కురవడం మొదలెట్టింది. చిరు చలి. బ్యాక్పాక్లోని బట్టలన్నీ తీసి ఒకటికి రెండు పాలిథిన్లలో భద్రంచేసి వానను జయించినవాడిలాగా ముందుకే సాగాను. వర్షాలంటే సంకోచమే ఉంటే ఇలాంటి నడకల ప్రసక్తే పెట్టుకోం గదా!
- రెండు ప్రయాణాలు – ఒక ప్రయోగం...
