-
-
మణిసేతువు
Mani Setuvu
Author: Dr. Kovela Suprasannacharya
Pages: 106Language: Telugu
"ఈ కావ్యం పౌరాణికం కాదు. అనుభవ ప్రపంచం. సౌందర్య లోకం. మార్మిక స్తరం, దివ్యానుభవం సంయోజితాలై స్వయంగా ఏర్పడ్డ మంటికి మింటికి నడిమి లంకె - సేతువు.
- సుప్రసన్నాచార్య
* * *
'మణిసేతువు' ఒక విలక్షణమైన కావ్యం. ఇది ఒక శతకమూ కాదు, కథా వస్తుసహిత కావ్యమూ కాదు. కవితల సంకలనమూ కాదు. అచ్చంగా - ప్రహతంగా గుర్తింపబడుతున్న 'భావకవితా' విధానమూ కాదు. అనుభూతి కవితా విధానమనవచ్చు గాని, దీని స్వరూప స్వభావాలు వేరు. ఒక విధంగా చెబితే ఇది వ్యక్తావ్యక్తాల మధ్యన సాగిన ప్రయాణం. ఆ సాగిన ప్రయాణం మణిసేతువు మీద. మణి ప్రకాశవంతం. ఇది వికాసశీలంగల పద్మానికి ప్రతీక. యోగ విధానంలో గుర్తింపబడే మనలోని షట్చాక్రాల చక్రత్వానికి నిర్దిష్ట సూచిక. మూలాధార చక్రం నుండి సహస్రారమ్ దాకా సాగే ప్రయాణం. ప్రయాణంలో వివిధ స్థాయిలోని అనుభవాలు, భావనలు, అనుభూతులు వీటన్నిటి సమాహారంగా ముందు - వెనుక - ముందుల రాకపోకలుగా అభివ్యక్తమయిన కావ్యం. కావ్య ప్రయత్నమంతా నేలను నింగికీ, నింగిని నేలతో సమన్వయింపజేసి విలక్షణమయిన లయను సాధించడమే.
- సంపత్కుమారాచార్య
