-
-
మాండలీకం (కుల, వృత్తి పదకోశం)
Mandaleekam Kula Vruthi Padakosham
Author: Butham Muthyalu
Publisher: Gumpu Sahithi Samstha
Pages: 192Language: Telugu
తెలంగాణ ప్రాంతాన్ని ముందుగాత శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు అటుతర్వాత మొఘలాయిల ఎలుబడిలో ముస్లిం రాజ్యస్థాపన జరిగింది. తదుపరి మొఘలాయిల పతనంతో గోల్కండ కేంద్రంగా అసప్‌జాహీలు (తానీషాలు) పాలన సాగించారు. వారికాలంలో తెలంగాణ భాషలో ఉర్దు మిలితమైంది. తదుపరి నిజాంలు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని పాలన సాగించారు. కడసారి నిజాం ఏలిన ప్రాంతమిది. ఇంతమంది ఏలినా! మనుషుల జీవన శైలి మారలే. చరిత్ర, సంస్కృతి ఆచారాలు, కుల వ్యవహారాలు, కుటుంబ వ్యవస్థ తీరు గ్రామ స్వరూపమై కుల పదజాల నుడికారం వృత్తులలో మమేకమై, కుల అల్లికమాండలిక పదజాలం విలువైన గుమ్మినిండిది, తొలకని సమాచారం నిలువై, కొన్ని వేల సంవత్సరాలు అనేక ప్రాచీన తెలుగు పద సంపద పదపదానికి ఈ ప్రాంతంలో తెలింగా, ఉర్ధూ, పార్సీ, కన్నడం, హిందూ, మార్వాడీ, తమిళం బాషలు కలయికలైన జీవబాష. దీనిని దక్కని బాషని అందురు హైదరాబాద్చుట్టూతా దేశ దేశాల ప్రజల సంస్కృతులతో విలసిల్లిన ప్రాంతం తెలంగాణైతే, నడిమిట్ల నల్లగొండ జిల్లా ప్రజల విశిష్టత మాండలిక పదజాలం, నట్టనడుమ ప్రాంతీయ ఏలుబళ్ళను, పద సౌందర్యమై బాషా శాస్త్రం సామ్యమైన భాషా రీతి కనిపిస్తుంది. కులవృత్తి పదాలు, బడుగు బలహీనవర్గాల, నిరక్షరాస్యుల మాండలిక పదజాలం ఇది.
కుల వృత్తి మాండలిక పదకోసం బలహీనవర్గాల సామాజిక బాషా వ్యవహార కలయికై, సమూహమై కుల పనులకు సంబంధించిన వృత్తి చిహ్నాలు బాషా నిర్మితానికి ప్రాతినిద్యం అందిస్తూ, క్షేత్రస్థాయి అస్తిత్వ అనుభవమై పరిశీలనే పరిశోదనా దృష్టి నిజాయితీని గుండెనిండా ఆలింగనం చేస్తే తప్పా, బాషా శాస్త్రం వర్ధిల్లదని అర్థమైతుంది.
ఈ కుల వృత్తి మాండలిక పరిశోధక కవి రచయిత ముత్యాలు. కవిత, కథ, నవలా ప్రక్రియల యందు చేయి తిరిగిన రచయిత. ఈయన ఉపాధ్యాయుడు. స్థానికతపై పరిపక్వత ఉన్న భూతం ముత్యాలు ''గుంపు'' సాహితీ సంస్థలో సభ్యుడై, సాహితీ సృష్టి సాగిస్తున్నాడు. మాండలిక బాషా ప్రణాళికను ఒడుపుతో తనవైపు తిప్పుకొన్న రచయిత. ''గుంపు'' సాహితీ సంస్థ ప్రచురణలు కక్క, సిద్ధి, ముల్కి, సూర, పురుడు, ఇగురం, బేగరి కథలు మొత్తం ఎనిమిది పుస్తకాలల్లో కులవృత్తి పదాల్ని వెతికి మాండలిక పదకోశ నిర్మాణానికి ముందడుగు వేసినాడు ముత్యాలు. బాషకు కులవృత్తి జతపరుస్తూ, మాండలికం మలినం కాకుండా భద్ర పరుస్తుండు. ఇది తెలుగు మాండలిక పదకోశ సృష్టికి తొలి అడుగులు.
- వేముల ఎల్లయ్య
