• Manchu Moggalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మంచు మొగ్గలు

    Manchu Moggalu

    Pages: 255
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మాటల సందర్భంలో రవి చెప్పిన ఆఫీస్ ఎడ్రస్ గుర్తుకు వచ్చింది క్రిస్టీకి. కంగారుగా టెలిఫోన్ డైరెక్టరీ తిరగవేసి లండన్ వీక్ ఎండ్ వారపత్రిక ఫోన్ నెంబర్ వెతికి పట్టుకుంది.
“ఓ..హల్లో... లండన్ వీక్ ఎండ్ పబ్లిషర్స్ ఆఫీసేనా అది...” అని అడిగింది క్రిస్టీ ఎవరో తరుముకు వస్తున్నట్లు తడబడిపోతూ.
అవతలి కంఠం 'ఎస్' అనీ అనటంతో ప్రశ్నల వర్షం కురిపించింది.
“మిష్టర్ ప్రతాప్ ఉన్నాడా... ఆదే మీ పత్రిక ఆర్టిస్ట్ గా పని చేస్తుంటాడు చూడండి ఓ ఇండియన్ అబ్బాయి ... ఆతడు కావాలి ... ప్లీజ్ ... అతడితో వెంటనే మాట్లాడాలి... ఒకసారి ఫోన్ దగ్గరకు పిలుస్తారా...”
“ఒక్క నిముషం” అంటూ ఆవతలి ప్రక్క స్త్రీ ఫోన్ ఎవరికో అందించింది.
“హల్లో.. మేనేజర్ ని మాట్లాడ్తున్నాను ఏంకావాలి మీకు..” అంది ఓ మధ్య వయస్కుడి గొంతుక .
“మిష్టర్ ప్రతాప్ తో అర్జెంట్ గా మాట్లాడాలి... ఒకసారి ఫోన్ యిస్తారా అతడికి..”
“మిస్టర్ ప్రతాపా... “ఎవరో తెలీనట్లు రెట్టించాడు ఆ మనిషి
“మీ పేపర్లో కార్టూన్లు గీస్తుంటానని చెప్పాడు మరి...” నెమ్మదిగా నసిగింది.
“ఓ ... యు మీన్ రవి ...”
“ఎస్ ప్లీజ్ రవి ప్రతాప్ తోనే మాట్లాడాలి ...”
"సారీ మేమ్ ... రవి ఈ మధ్య ఆఫీస్ కి రావటం లేదు ...”
“ఆఫీస్ కి రావటం లేదా... కారణం ఏమిటో మీకేమైనా తెలుసా...”
“నో... నాట్ రియల్లీ...”
“పోనీ ఆతను ఎక్కడ వుంటాడో చెప్పగలరా”
“యూ మీన్ .. ఇంటి ఎడ్రస్ కావాలా ... వెల్... అవన్నీ పర్సనల్ విషయాలు ..” చెప్పాలా వద్దా అన్నట్లు సందేహిస్తూ క్షణకాలం మాటలు మింగాడు ఆ మేనేజర్ “సారీ మేమ్ ... నాకు తెలీదు ఆ వివరాలు” అన్నాడు ఆఖరికి.
“మీ ఆఫీస్లో పనిచేసే ఉద్యోగుల చిరునామాలు వుండవా మీ దగ్గర ...” కోపంలోనో, కంగారులోనో కాస్త గద్దించి ఆడిగింది క్రిస్టీ.
“చూడు మిస్ ... నువ్వు ఎవరో నాకు తెలీదు ... బహుశా రవి గర్ల్ ఫ్రెండ్ వి అయి వుండాలి ... అవునా” వ్యంగ్యంగా నవ్వాడు ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి.
“చూడు మిస్టర్... రవి నాకు పరిచయస్థుడు మాత్రమే ... బాయ్ ఫ్రెండ్ మాత్రం కాదు... ఆపైన .. నేనేమీ రష్యన్ గూఢచారినీ కాదు ... మీ పేపర్ రహస్యాలు బయటకు లాగటానికి కాదు ఈ తతంగమంతా... అర్ధమయ్యిందా... అనవసరంగా వర్రీ అవ్వకండి...” అంది క్రిస్టీ కటువుగా వెటకరిస్తూ.
“ఉద్యోగస్థుల వివరాలు ఏమీ అగంతకులకెవరికీ అందచేయకూడదన్న నిర్బంధాలు నిబంధనలు కొన్ని వుంటాయి మరి ... ఏం చేయమంటావ్ ... కనీసం ముఖాముఖి అయితే మనిషి ఎవరో చూసి తెలుసుకోవచ్చు... ఫోన్లో ఎలా వీలవుతుంది చెప్పు మిస్ ..”
“నేను చెప్తున్నాను కదా... నా పేరు క్రిస్టీ వాకర్ ... విక్టోరియా దగ్గర మా మామాడ్యూక్ రోయల్ కెసీనోలో చిప్స్ సెల్లర్ గా పని చేస్తుంటాను ... కావాలంటే ఫోన్ చేసి అడగండి నా మేనేజర్ మెక్ నైట్ ని ... ప్లీజ్ ఇది చాలా ముఖ్య మైన విషయం ... రవిని త్వరగా కలుసుకోవాలి ...ప్లీజ్... ఎక్కడ దొరుకుతాడో చెప్పండి... లేదా కనీసం ఫోన్ నెంబర్ అయినా వుంటే ఇవ్వండి ..” అంది బతిమాలుకుంటున్న ధోరణిలో.
“సరే .. అయితే ఈ నెంబర్ కి ట్రై చేయండి ..” అంటూ మేనేజరు జాలిపడి ఒక ఫోన్ నెంబరు యిచ్చాడు చివరికి.

Preview download free pdf of this Telugu book is available at Manchu Moggalu