• Manavendranath Roy Viplava Jeevitam
  • Ebook Hide Help
    ₹ 150
    450
    66.67% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మానవేంద్రనాథ్ రాయ్ విప్లవ జీవితం

    Manavendranath Roy Viplava Jeevitam

    Pages: 554
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇండియాలో ఎం.ఎన్.రాయ్‌తో పోల్చదగినవారెవరూలేరు. గాంధీజీ ఇండియా గర్వించదగిన నాయకుడైనప్పటికీ, ఆయన అనుసరించిన పంథా మతపరమైనది. మానవేంద్రనాథ్ రాయ్ ఇండియాలో మొదటిసారిగా రాజకీయాలస్థాయి పెంచడానికి, నీతికి స్థానం కల్పించడానికి కృషిచేశాడు. అంతకంటే ముఖ్యమైన విషయం, సైన్సు ఆధారంగా రాజకీయాలను పరిశీలించప్రయత్నించాడు. వైజ్ఞానిక పద్ధతి ప్రకారం తప్పులు దిద్దుకుంటూ, కొత్తది తెలుసుకుంటూ ముందుకు సాగిపోవడం మానవలక్షణం, ఆ ప్రయోగాన్ని రాయ్ చేశాడు. బాంబులువేసి రైళ్ళు పడగొట్టి తెల్లవారిని వెళ్ళగొట్టాలనే ప్రయత్నం చేసిన ఉగ్రజాతీయవాది ఎం.ఎన్.రాయ్. అట్లాంటి స్థాయి నుండి ఎదిగి కమ్యూనిస్టుగా మారాడు. మెక్సికో, రష్యా, చైనా చరిత్రలో స్థానం పొందాడు. క్రమేణా కమ్యూనిజాన్ని మించిపోయి నవ్యమానవవాదిగా ఆదర్శప్రాయుడయ్యాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఎం.ఎన్.రాయ్ వీరారాధనను, మూకస్వామ్యాన్ని, అధికార అవినీతి రాజకీయాల్ని తృణీకరించాడు.

ఇండియా పరిస్థితులను బాగా అధ్యయనం చేసిన రాయ్ మనకు తక్షణం పునర్వికాసం కావాలని తేల్చాడు. సాంఘిక రాజకీయ ఆర్థిక మార్పులు జరగాలంటే మానసికంగా మనం మారాలన్నాడు. ఇందుకు మార్గాన్వేషణ చేశాడు. ఇతరులను చేయమన్నాడు. కాని అదేమంత సులభం కాదు. రాయ్ ది ఎదురీత, ప్రవాహానికి వాలుగా పోవడానికే ఎక్కువమంది ప్రయత్నిస్తారు. తమకోసం ఇతరులు ఆలోచించి సులభమార్గాలు చూపాలనుకుంటారు. రాయ్ ఇందుకు భిన్నంగా, స్వయంశక్తిపై ఆధారపడి, ప్రతిభకు వన్నె పెట్టుకోమన్నాడు.

ఎమ్.ఎన్. రాయ్ తో 1930 నుంచీ సన్నిహిత సహచరుడుగా కృషిచేసిన కార్మిక నాయకుడు వి.బి. కార్నిక్, ఈ జీవిత చరిత్రను వ్రాశాడు. సాధ్యమైనంతవరకు సమగ్రత తేవడానికి ప్రయత్నించారు. అయినా ఇంకా అక్కడక్కడా వివరాలు అవసరం అనిపిస్తుంది.

ఎం.ఎన్.రాయ్ వ్యక్తిగా, రచయితగా ఈ తరం వారికి కొత్త, ఆయన రచనలు సునిశితంగా పరిశీలించడం అవసరం. రాయ్ జీవితం తెలుసుకుంటే ఎంత ఆశ్చర్యపడతారో, ఆయన రచనలు చదువుతుంటే అంతగా ఆలోచన చేస్తారు. ఆలోచనలవల్ల అన్వేషణ జరుగుతుంది. వ్యక్తి విశిష్ఠత - కొత్తను తెలుసుకొని, అకళింపు చేసుకొని, తాను ఎదిగి, చుట్టూ ఉన్నవారికి తెలియజెప్పడమే సమాజ నిర్మాణానికి రాయ్ రచనలు, జీవితం తెలుసుకోవాలి.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Manavendranath Roy Viplava Jeevitam