-
-
మా'నవ' వాదం జీవన నినాదం
Manava Vadam Jeevana Ninadam
Author: Dr. Devaraju Maharaju
Pages: 216Language: Telugu
వైజ్ఞానిక రంగంలో మహామహులైన శాస్త్రవేత్తలున్నారు. కానీ, వారు వారి వారి ప్రయోగశాలలకు మాత్రమే పరిమితమై ఉంటారు. దేశ విదేశాల్లో సెమినార్లకు, సింపోజియాలకు వెళుతుంటారు గానీ, సగటు మనిషికి తమ జ్ఞానసారాన్ని అందిందామన్న ఆలోచన వారికుండదు. ఇక సరళ వైజ్ఞానిక రచయితలు కొన్ని విషయాల్లో వారి స్థాయిని అందుకోలేకపోవచ్చు కానీ, శాస్త్రవేత్తలు చేయలేని పనులు వీరు చేస్తుంటారు. విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని, జన బాహుళ్యానికి వైజ్ఞానిక అంశాలు తమ రచనల ద్వారా అందిస్తుంటారు. ఆ రకంగా నేను జీవశాస్త్ర పరిశోధనల్లో మునిగినా, నాలోలోపల ఉన్న బాధ్యత గల రచయిత కొంచెం రూపు మార్చుకుని సరళ వైజ్ఞానిక రచయితగా ముందుకొస్తుంటాడు. సాహిత్యరంగంలో ఏ ప్రక్రియకు ఉండే ప్రయోజనం ఆ ప్రక్రియకు ఉన్నట్లే, సైన్సు రచనలకు ఉండే ప్రయోజనం సైన్సు రచనలకూ ఉంటుంది. ఒకటి ఎక్కువా ఒకటి తక్కువా కాదు - అన్నీ సమాజ చైతన్యానికి దోహదం చేసేవే! కవిత్వమైనా సరే శాస్త్రీయ అవగాహనతో రావాలంటాను. కళల గూర్చి, కళా ప్రయోజనాల గూర్చి తెలుసుకోండని సైంటిస్టు మిత్రులకు చెబుతుంటాను. నాణానికి రెండు వైపులూ ముఖ్యమే అన్నది నా అభిప్రాయం. సైన్సు సమాచారం ఇవ్వడానికి నేను సైన్సు రాయలేదు. జనంలో వైజ్ఞానిక స్పృహ పెంచడానికి రాశాను. అందులోనూ వివిధ సాహితీ ప్రక్రియల్లో సైన్సు జొప్పించాను. ఆ దృష్టి కోణంలోంచి చూసిన వారికి ఈ విషయం అవగతమౌతుంది. నా రచనలతో ఏ ఒకరైనా శాస్త్రీయ అవగాహన పెంచుకుని, మానవతావాదిగా మారి, సమాజానికి ఉపయోగపడితే నా కృషి ఫలించినట్టే!
- డా. దేవరాజు మహారాజు
