-
-
మానవ సమాజం - ప్రజాశక్తి బుక్ హౌస్
Manava Samajam PSBH
Author: Rahul Sankrityayan
Pages: 368Language: Telugu
మానవ సమాజాన్ని గురించి నాకు లభ్యమైన శాస్త్రీయ పరిశోధనలను దీనిలో పొందుపరుస్తున్నాను. ఈ పుస్తక రచనకు సాయపడిన పుస్తకముల పట్టికను ఈ పుస్తకము చివర ఇస్తున్నాను. ఇంకా పూర్తి వివరాలకు ఎన్నో పుస్తకాలను పరిశీలించవలసి వుంది. 'డేవిలీ' క్యాంపు జైలులో నేను ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని వ్రాశాను. ఆ పరిస్థితుల్లో దొరికిన పుస్తకాలతోనే నేను సరిపెట్టుకొనవలసి వచ్చింది. అంతిమ సత్యమనేది లేదు. భావితరం ఒక మెట్టుపైకి జేరేందుకు ఈ పుస్తకం ఉపయోగపడితే నాకు అది చాలు. అందుకు ఈ పుస్తకం ఖాయంగా ఉపయోగపడుతుంది.
'మానవ సమాజ' వ్రాతప్రతిని కామ్రేడ్ డాంగే ఓపికతో చదివి వారి అమూల్యమైన సలహాలను నాకు ఇచ్చారు. అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఒకరు రచన చేసేటప్పుడు ఎలాంటి భాషను వాడాలి అనే విషయాన్ని గురించి డా.భగవాన్ దాసు (కాశీ) ఇలా అన్నారు: ''రచనలో వాడే భాష ఇల్లాలికి అర్థం కావాలి. అంటే 'సులభశైలి'లో ఉండాలి''. ఈ మాట నామదిలో ఎప్పుడూ మెదలుతూనే ఉంది. ఆంగ్లభాష ఏ మాత్రం తెలియని హిందీ శ్రోత ఈ పుస్తకంలోని అధ్యాయాలను విన్నప్పుడు అతనికి కఠినంగా ఉన్న పదాన్ని తొలగించి దాని స్తానే తేలిక పదాన్ని వాడలనేది నా అభిప్రాయం. కాని నాకు జైలులో అటువంటి వ్యక్తి లభించలేదు. తర్వాత నేను హజారీ బాగ్ జైలుకు మారిన తర్వాత కామ్రేడ్ నాగేశ్వరసేన్ దీనిని క్షుణ్ణంగా చదివాడు. కాని ఏ సలహాను నాకు ఇవ్వలేదు. వారు ఇచ్చివుంటే దానిని సంతోషంగా అంగీకరించి వుండేవాణ్ణి. ఒకటి మాత్రం నిజం. నేను సులభశైలికే అంకితమయ్యాను. 'విశ్వ కీరూప్ రేఖా' 'మానవ సమాజే', 'దర్శన్ దిగ్దర్శన్', 'వైజ్ఞానిక భౌతికవాదీ' అనేవి నేను వ్రాసిన నాలుగు పుస్తకాలు మానవ జాతి నేటి వరకు ఆర్జించుకొన్న జ్ఞానాన్ని క్లుప్తంగా అందించగల్గుతున్నాయి. అవి ఇచ్చే జ్ఞానం, జ్ఞానం కొరకు మాత్రమే కాదు, ఆ జ్ఞానంతో ప్రపంచాన్ని మార్చటానికి ప్రయత్నం జరగాలి.
- రాహుల్ సాంకృతాయన్
