• Manasu Palikindi Ee Mata Revised
  • fb
  • Share on Google+
  • Pin it!
 • మనసు పలికింది ఈ మాట - రివైజ్డ్

  Manasu Palikindi Ee Mata Revised

  Pages: 125
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

.....సంధ్యా సమయంలో బీచ్ చాలా అందంగా ఉంది. బండి పార్క్ చేసి ఒక రాయిపై కూర్చున్నారు. అలలు వచ్చి ఆ రాయికి కొట్టుకుని వెనక్కి వెళ్తున్నాయి. కనికరించని ప్రియుడి గుండె రాయి అయితే, ప్రియురాలు అలలై ఆ రాయిని కదిలించడానికి కన్నీటితో దరిచేరుతున్నట్టుగా ఉంది.

అరవింద్ తన జేబులోంచి మొబైల్ తీసి రాజీవ్ కి ఇచ్చాడు. రాజీవ్ దాన్ని అందుకుంటూ "కొత్త మొబైలా?" అని అడిగాడు. "విషయం అది కాదు. ఇన్ బాక్స్ ఓపెన్ చేసి చూడు " అన్నాడు అరవింద్. రాజీవ్ ఇన్ బాక్స్ ఓపెన్ చేసాడు. నవ్య పంపిన మెసేజ్ ఉంది. అందులో "హాయ్ అరవింద్ అన్నయ్య, నేను రాజీవ్ తో కలిసి ఉంటున్నానే కాని అస్సలు దగ్గరవలేకపోతున్నాను. తనని ప్రేమిస్తున్న విషయం తనకి తెలిసినా కూడా ఎందుకు ఇష్టపడటం లేదో నాకు అర్ధం కావడం లేదు. ఒక అమ్మాయి ఇంతలా సిగ్గు విడిచి చెప్తున్నా సరే రాజీవ్ ఎందుకలా దూరం చేస్తున్నాడో తెలియడం లేదు. నాలో ఏం నచ్చలేదో ఒక్కటి చెప్పమను అన్నయ్య , తనకోసం ఏమైనా మార్చుకుంటాను. ఇంతలా అతన్నే ఎందుకు కోరుకుంటున్నావు అంటే నా దగ్గరున్న ఒకే ఒక సమాధానం అతన్ని నేను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను" అని ఉంది. దాదాపు నాలుగున్నర పేజీల మెసేజ్. చదివిన తర్వాత అరవింద్ కి మొబైల్ ఇచ్చాడు. ఏం మాట్లాడకుండా సముద్రంకేసి చూస్తూ నుంచున్నాడు రాజీవ్.

"ఏం చెప్పమంటావ్?" అని ప్రశ్నించాడు అరవింద్.

"చచ్చిపొమ్మను...." అన్నాడు రాజీవ్ బదులుగా. పెద్ద అల వచ్చి ఆ రాయికి కొట్టుకుని చెల్లాచెదురైపోయింది. చిన్న చిన్న నీటి తుంపరలు వాళ్ళని తడిపేసాయి. అరవింద్ కనుబొమ్మలు దగ్గరయ్యాయి. క్షణం తర్వాత "అంతకంటే ఇంకేం చేస్తారు ప్రేమించినవాడు కాదంటే " అన్నాడు రాజీవ్ మళ్లీ.

*****

......అచ్యుత్ గుండె పగిలిపోయింది. అతని కళ్ళల్లో నీళ్ళు చెంపలను తాకాయి. గొంతు డిక్కట్టేసింది. ముక్కు ఎర్రబడింది. "నేనంటే నీకు ఇష్టం లేదా చైతన్యా?" అని అడిగాడు గద్గదమైన గొంతుతో.

"ప్లీజ్ అచ్యుత్ ఫ్రెండ్స్ గా ఉందాం" అంది. అంతే, అటువైపు తిరిగి పరిగెత్తాడు. రొమ్ములెగసేంత ఆయాసంతో రోడ్ పైకి వచ్చాడు. అలానే పరిగెత్తుకుంటూ రాజీవ్ దగ్గరకు వెళ్ళాడు. అరవింద్ కూడా అక్కడే ఉన్నాడు. పరిగెత్తుకొస్తున్న అచ్యుత్ ని చూసి కంగారుపడ్డారు ఇద్దరు. "ఏంటిరా ఏమైందిరా?" అని అడిగారు.

"ఐ లాస్ట్ మై లైఫ్ " అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు పిచ్చివాడిలా. "ఏమైందిరా?" అని అడిగాడు అరవింద్ పక్కన కూర్చుంటూ. ఏడ్చి ఏడ్చి కందిపోయిన మొహంతో ఎర్రబడ్డ కళ్ళతో “చైతన్యకు నిజం తెలిసిపోయింది. రాత్రి నన్ను చూసేసింది. నా ప్రేమను ఒప్పుకోవడం లేదు” అంటూ జరిగిన విషయం చెప్పాడు.

"ఏంటిరా ఇది చిన్నపిల్లాడిలాగా?" అంటూ కళ్ళు తుడిచాడు అరవింద్. అచ్యుత్ లేచి నిలబడి రెండు చేతులతో కళ్ళు తుడుచుకుని "కొంతకాలం నన్ను వదిలేయండిరా..." అని వెళ్ళిపోబోయాడు. రాజీవ్ కంగారుగా "ఒరేయ్ ఆగు, ఎక్కడికెళ్తావ్?" అని ఆపాడు. వెళ్తున్న వాడు ఆగి వెనక్కి తిరిగి " చచ్చిపోనులేరా! ప్రేమించాను అని చెప్పేంత ధైర్యం లేదు. ఇక చచ్చేంత ధైర్యం అసలే లేదు. మీరు కంగారు పడకండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.

Preview download free pdf of this Telugu book is available at Manasu Palikindi Ee Mata Revised