-
-
మనసు పలికె
Manasu Palike
Author: Bhimaraju Venkata Ramana
Publisher: Palapitta Books
Pages: 108Language: Telugu
హాస్య కథారచయితగా 'కుడిఎడమైతే...' కథాసంపుటి ద్వారా పేరుపొందిన శ్రీ భీమరాజు వెంకటరమణ గంభీరంగా కూడా కథలు రాసి పాఠకులను ఆకట్టుకోగలరని ఈ కొత్త కథాసంపుటి నిరూపిస్తుంది. జీవితంలో ఎటువంటి తీవ్ర సమస్యలు ఎదురైనా, వాటివల్ల నిస్పృహ చెందకుండా, వాటిని కాస్త తేలిగ్గా తీసుకుని, వివేకవంతంగా ఆలోచిస్తే, జీవించం సులభ సాధ్యం. సుఖప్రదం అవుతుందని సూచిస్తారు వెంకటరమణ ఈ సంపుటిలోని కథల ద్వారా.
నిత్య వ్యవహారంలో రాతల్లోనూ, సంభాషణల్లోనూ మంచి తెలుగు భాష తరిగిపోతున్న ఈ రోజుల్లో, తెలుగు నుడికారాలను అలవోకగా వాడుతూ, తెలుగు సంస్కృతినీ, తెలుగు భాషలోని అందాన్నీ నిలబెడుతున్నారు వెంకట రమణ.
నిత్య జీవితంలో కుటుంబ సంబంధాల్నీ, ఇతర మానవ సంబంధాల్నీ చిత్రిస్తూ ఇంతకుముందు హాస్యస్ఫోరకంగా కథలుగా రాసి, ఇప్పుడు ఇలా వైవిధ్యపూరితమైన కౌటుంబిక, సామాజిక అంశాల్ని తీసుకుని సందేశాత్మకంగా కథలు రాయడంలో కూడ అంతే సమర్థులని నిరూపించుకున్న భీమరాజు వెంకటరమణగారికి నా అభినందనలూ, శుభాకాంక్షలూ!
- అబ్బూరి ఛాయాదేవి
