• Manassakshi Mahabharatam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మనస్సాక్షి మహాభారతం

    Manassakshi Mahabharatam

    Pages: 136
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మానవ జీవితానికి మణిదర్పణం మహాభారతం. భారత కథా సన్నివేశాలను, పాత్రలను వ్యాసమహర్షి మలచి, మనకు అందించిన తీరు ఈ సత్యాన్ని తేటతెల్లం చేస్తుంది. వ్యాస సరస్వతి అడుగుజాడల్లో తమ కవితా సరస్వతిని నడిపించి, భారతరచన ద్వారా జాతికి జీవం పోశారు ఆంధ్రభారత కవిత్రయం. భారతకథలోని సార్వకాలిక ప్రబోధాన్ని సమకాలీన సమాజానికి సమన్వయించి, చక్కని రచనలు అందించే సారస్వతోపాసకులు మనకు నేటికీ దర్శనమిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో అగ్రేసరులు అవధాన విద్యావిశారదులు డా॥ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌.

సజీవసంప్రదాయంలోని విలువలను నేటి తరానికి అందించే మహత్తర కార్యాన్ని సంకల్పించి, అందుకు బృహత్తర ప్రణాళికను రూపొందించుకున్నారు డా॥ పాలపర్తి వారు. భారత కథలోని ఆణిముత్యాల వంటి అద్భుత సందేశాలను ఏర్చి, కూర్చి వారం వారం ‘సాక్షి’ దినపత్రిక ద్వారా ఆంధ్ర పాఠకలోకానికి అందించారు.

మనస్సే ప్రధాన జీవలక్షణంగా మనుగడ సాగించే మానవుడు ` తన మనస్సును ఎలా దారికి తెచ్చుకోవాలో, అలాంటి మనస్సులోని భావాలను వాగ్రూపంలో వ్యక్తీకరించేటపుడు ఎలాంటి జాగరూకతను పాటించాలో, కామక్రోధాలను ఎలా అదుపు చేసుకోవాలో ఈ వ్యాసాల్లో నిరూపించారు శ్రీ శ్యామలానంద ప్రసాద్‌.

తపశ్శక్తి కాని, రాజ్యాధికారంకాని, సిరిసంపదలు కాని సార్థకం కావాలంటే అవి శాశ్వతంగా ఆనందాన్ని మాత్రమే కలిగించే విధంగా వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఓర్పు నేర్పులతో వివరించారు ఈ రచయిత. మనస్సు, మాటలు, చేతలు నిగ్రహమనే సరిహద్దులకు లోబడి ఉన్నప్పుడే అభ్యుదయం సాధ్యమవుతుందని హితవు పలికారు వ్యాసకర్త. సత్యధర్మాల తీరుతెన్నులను సప్రమాణంగా ఆవిష్కరించారు. మానవుడు తాను ధైర్యం కలిగి వర్తించవలసిన ఆవశ్యతను, అందువల్ల కలిగే ప్రయోజనాలను సరళసుందరంగా అందించారు రచయిత. ప్రజాజీవనం, పరోపకారం, కృతజ్ఞత, సహజీవనం, సౌజన్యం... ఒకటేమిటి ? మానవ జీవితానికి సంబంధించిన విజ్ఞాన సర్వస్వాన్ని, సంక్షిప్త సుందరంగా, సమగ్ర భావబంధురంగా అక్షరాల్లో పొదిగి అందించారు పాలపర్తి వారు. పనిలో పనిగా పండుగలు, పరమార్థాలు, ఆచారాలు, అంతరార్థాలు కూడా హాయిగా నిరూపించారు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Manassakshi Mahabharatam