-
-
మానస సరోవరం
Manasa Sarovaram
Author: Gajanan Taman
Language: Telugu
శ్రీరాముడేలిన దండకారణ్యంగా స్వ. సేనాపతి అభివర్ణించిన ఆదిలాబాద్‌లోని ఆసిఫాబాద్‌కు చెందిన చాకేపల్లి మక్తేదారుల కుటుంబంలో స్వ. రాధాబాయి - గుణవంతరావులకు ప్రథమపుత్రునిగా జన్మించారు. ఇంటివద్ద రెండవ తరగతి వరకు చదివి, మంధని ప్ర. ఉ. పా. నుండి 1953లో మెట్రిక్ ఉత్తీర్ణులైనారు. 1954-58 మధ్య ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, అది వదిలి, మహారాష్ట్రలోని పీపుల్స్ కాలేజ్ నాందేడ్ నుండి బి.ఏ. మరాఠ్వాడా యూనివర్సిటీ, ఔరంగాబాద్ నుండి ఆంగ్లంలో ఎం.ఏ చేశారు.
తాను చదివిన కాలేజ్‌లోనే వ్యాఖ్యాతగా 1965లో చేరి, కొంత కాలం ప్రాచార్యపదవిని అలంకరించి, ఆంగ్లస్నాతకోత్తర విభాగ ప్రముఖునిగా 1996లో సేవానివృత్తులైనారు.
బహుభాషలకు నిలయమైన పరివారానికి చెందిన ఈయన ఆంగ్లంతో పాటు తెలుగు, మరాఠీ, హిందీ మరియు ఉర్దూ భాషలలో, స్పృహణీయవైదుష్యం కాకపోయినా, చెప్పుకోదగిన ప్రవేశం సంపాదించారు.
ఇటీవలే ప్రచురితమైన ఈయన కంఠోపనిషత్తు (తెలుగు పద్యానువాదం) పలువురు సాహిత్యాచారుల దృష్టిని ఆకర్షించింది. ఈయన నాలుగు కవితలను 'భారతి' ప్రచురించినది. పురుషోత్తం రేగే మరాఠీ నవల సావిత్రికి ఈయన చేసిన తెలుగు అనువాదం ఇప్పటికీ అముద్రితం. సంప్రతి: ఈయన మంథనిలో ఉంటూ, సంస్కృత సాహిత్యాధ్యయనంలో భాగంగా సాయణాచార్యుల వారి భాష్యం సహాయంతో ఋగ్వేదం చదువుతున్నారు.
గత సంవత్సరం శ్రీ గట్టు నారాయణ గారి Noble Leader (A Journey through Dharmapada)ను ఉదాత్త నేత గా, Offerings I & II ను కథాంజలి I & II గా తెలుగులోకి అనువదించారు.
అరువదిఏడు వసంతాల జీవితంలో, తీపిని మించి చేదును చవిచూసిన ఈయన తన 'జీవనవాదా'న్ని మార్క్స్‌వాద దృక్పథాన్ని ఏ మాత్రం వదులుకొనలేదు.
"వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి" అనునది వాల్మీకి వాక్కు కదా....!
