-
-
మన ఋషులు
Mana Rushulu
Author: Lakshmana Rekha N. Gopalakrishna
Pages: 68Language: Telugu
శ్రీ ఎన్. గోపాలకృష్ణ గారు ‘లక్ష్మణరేఖ’ చిత్రం ద్వారానే అందరికీ చిరపరిచితులు. కానీ వారి సాహితీ వ్యాసంగం గురించి వివేచించినప్పుడు ‘సాహిత్యశ్రీ’ అనే బిరుదు అన్వయార్థంగా కన్పిస్తుంది. వివిధ అంశాలపై పలు గ్రంథాలను వెలువరించిన గోపాలకృష్ణ గారు. ఋషుల గురించి రాసిన ఈ గ్రంథం చాలా విలువైంది. భారతీయులు ఋషి సంతతి వారు. ప్రతి మనిషి
తీర్చవలసిన ఋణాలలో ఋషి ఋణం చాలా పవిత్రమైంది. ఈ గ్రంధ రచన ద్వారా గోపాలకృష్ణ గారు ఆ ఋణ విముక్తులైనారు.
రచయిత ఈ గ్రంథంలో 14 మంది ఋషుల గురించి సులభశైలిలో రాశారు. ప్రత్యేక ఋషి పుట్టుక వృత్తాంతం ఆ ఋషి ప్రస్తావనగానీ, ఉదంతాలుగానీ భారత భాగవత, ఇతర పురాణాల నుండి గ్రహించి కూర్చారు. ఈ ఋషులు ప్రామాణికంగా చెప్పిన ధర్మాలు భారతీయులకు ఎప్పుడూ శిరోధార్యాలే! భరద్వాజ మహర్షి ‘వైమానిక శాస్త్రం’, కశ్యపుని ‘కశ్యపగీత’
‘అత్రిస్మృతి’, విశ్వామిత్ర స్మృతి, గౌతమ ధర్మ సూత్రాలు, న్యాయశాస్త్రము, గౌతమ సహితమనే జ్యోతిష్య గ్రంథము, వశిష్ట స్మృతి, మార్కండేయ పురాణం, ఉత్తర రామాయణం, అష్టావక్ర సంహిత మొదలైన పవిత్ర విజ్ఞాన భాండాగారం ఈ మహాఋషుల అనుగ్రహమే.
ఆధ్యాత్మిక రంగంలో భారతదేశం యావత్ప్రపంచానికి గురుస్థానంలో ఎప్పుడూ ఉన్నది. శ్రుతులు వేద సాహిత్యమంతటికీ అన్వయిస్తాయి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అనగానే ఇవన్నీ మనకి అర్థం కావులే! అనే భావన చాలా మందిలో ఉంది. మన ఋషులు వేద విభాగంలో జీవించిన వాళ్ళు. వాళ్ళ జీవన విధానం (లైఫ్ స్టైల్) పరిశీలించి మనం అవలంబిస్తే
చాలు... కరుణ, దయ, క్షమ, లోక క్షేమం, దాన ధర్మాలు, గురువుని గౌరవించటం, పరంజ్యోతిని అర్చించటం. దిన కర్మలలో మెళకువలు పెద్దలను, గోవులను గౌరవించి పూజించటం మహా ఋషుల జీవితంలో కన్పిస్తుంది. అతిథిని దైవంగా పూజించటం, అన్నం అమ్ముకునే ఆధునిక కాలంలో జీర్ణంకాని మాట.
గోపాలకృష్ణ గారి కలం ధన్యమైందని భావిస్తూ వారిని అభినందిస్తున్నాను.
- డా॥ సి. భవానిదేవి

- ₹108
- ₹60
- ₹270
- ₹60
- ₹60
- ₹60