• Mana Nayakulaki Kasinta Bhoutika Sastram
 • Ebook Hide Help
  ₹ 86.4
  96
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • మన నాయకులకి కాసింత భౌతికశాస్త్రం

  Mana Nayakulaki Kasinta Bhoutika Sastram

  Pages: 101
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

“కాసింత కలాపోసన లేకపోయిన తరువాత మడిసికి గొడ్డుకి ఏంటి తేడా?” అన్నట్లే కాసింత శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోయిన తరువాత మడిసికీ గొడ్డుకీ ఏంటి తేడా?

ప్రపంచంలో నాలుగు మూలలా జరుగుతున్న విశేషాలని ప్రజలకి అందించే పత్రికా విలేకరులకి శాస్త్రంతో మౌలికమైన పరిచయం అత్యవసరం. చట్టాలు నిర్మించే శాసన సభలలో నాయకత్వం వహించే వారికి, వ్యాపార రంగాలలో ఇతర దేశాలతో మంతనాలు జరిపే వారికీ సైన్సులో ప్రతిభ లేకపోయినా, సైన్సు యొక్క పర్యవసానం అర్థం అవవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ నేను చెయ్యబోయే ప్రయత్నం అదే. చదవండి. చదివినది సమగ్రంగా అర్థం కాకపోయినా సూత్రప్రాయంగా అర్థం అయితే చాలు.

అసలు భౌతిక శాస్త్రం అంటే ఏమిటి? పదార్థము(మేటర్), శక్తి(ఎనర్జీ) అనే రెండింటి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలని అధ్యయనం చేసేదే భౌతిక శాస్త్రం. శక్తి యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే భౌతిక శాస్త్రం. ఈ శక్తి మనకి అనేక రూపాల్లో అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఇది చలన రూపంలోను, వేడి రూపంలోను, వెలుగు రూపంలోను, విద్యుత్ రూపంలోను, వికిరణం రూపంలోను, గురుత్వాకర్షణ రూపంలోను – ఇలా అనేక రూపాలలో మనకి తారసపడుతూ ఉంటుంది. ఈ శక్తికి కళ్లెం వేసి మన అవసరాలకి ఉపయోగించుకోవటానికి మనకి సైన్సుతో కనీసపు పరిచయం ఉండాలి. ఈ రకం పరిచయం విద్యార్థులకి తప్పనిసరి.

సాధారంగా సైన్సు చదవటానికి చాలమంది ఇష్టపడరు. సైన్సు అర్థం చేసుకోవటం శ్రమతో కూడిన వ్యవహారమని చాల మంది నమ్మకం. స్థూలంగా సైన్సుని రెండు శాఖలుగా విడగొట్టవచ్చు: భౌతిక ప్రపంచం (లేదా ప్రాణం లేని జడ పదార్థం) గురించి చెప్పేది ఒక శాఖ, ప్రాణంతో సంబంధం ఉన్న పదార్థాన్ని గురించి చెప్పేది రెండవ శాఖ. భౌతిక శాఖని అర్థం చేసుకోటానికి గణితం అత్యవసరం. మాటలతో వర్ణించటానికి కష్టమైన విషయాలు గణిత పరిభాషలో వర్ణించటం తేలిక. అలాగని వాక్యాలకి బదులు సమీకరణాలు రాసినంత మాత్రాన తేలికగా అర్థం అవాలని లేదు. చాలమంది “ఆల్జీబ్రా, గాండ్గాభరా” అని భయపడిపోయి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాంకేతిక శాస్త్రాలు చదవటం మానేసి ఏదో “తేలికైన” అంశాలు ఎంపిక చేసుకుని చదువు అయిందనిపిస్తారు. భౌతిక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించలేకపోయినా కొన్ని విషయాల గురించి మౌలికమైన అవగాహన ఉంటే జీవితంలో ఒక విధమైన సంతృప్తి ఉంటుందని నా నమ్మకం.

ఈ వెలితిని పూడ్చటానికి మన దైనందిన జీవితాలలో తారసపడే కొన్ని విషయాలని తీసుకుని, వాటి వెనక ఉన్న భౌతిక శాస్త్రపు కిటుకులని, తేలిక భాషలో, గణిత సమీకరణాల బెడద లేకుండా, విడమర్చి చెప్పాలనే ఆశతో రాసిన చిన్న చిన్న వ్యాసాలు ఇవి. ప్రతి వ్యాసం రెండు లేదా మూడు పుటలకి మించకూడదనే గమ్యంతో మొదలు పెట్టాను. అప్పుడప్పుడు ఒక పేజీ మాత్రమే ఉన్నా ఉండొచ్చు, నాలుగైదు పేజీల వరకు సాగవచ్చు. కావ్యాలు, ఖండకావ్యాలు, నవలలు, కథలు, కథానికలు, గల్పికలు, కార్డు కథలు ఉన్నట్లే సైన్సులో కూడ పొడుగాటి విజ్ఞానసర్వస్వాలు, పాఠ్య పుస్తకాలు, పరిశోధక వ్యాసాలు, జనరంజక వ్యాసాలు, చిట్టిపొట్టి వ్యాసాలు రాయవచ్చు. చిన్న విషయం తీసుకుని, దానిని ఒక కోణం నుండి పరీక్షించి, క్లుప్తంగా, చిన్న కార్డు కథలా చెప్పటమే ఈ వ్యాసాల ఉద్దేశం. చిన్నవి కనుక మీకు విసుగు పుట్టేలోగా ఆ అంశం చదవటం అయిపోతుంది. ఈ వ్యాసాలు ఒక వరుస క్రమంలో చదవాలని లేదు కాని, సంబంధిత వ్యాసాలని దగ్గర దగ్గరగా అమర్చాను.

- వేమూరి వేంకటేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Mana Nayakulaki Kasinta Bhoutika Sastram