• Mana Keerti Sikharalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మన కీర్తి శిఖరాలు

    Mana Keerti Sikharalu

    Publisher: Shaili Publications

    Pages: 63
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

బాలలు, జాతి, భాషా, కులమతాలకు అతీతంగా ఎందరో మహానుభావులు తమ జీవిత సర్వస్వాలను తృణప్రాయంగా భావించి భరతమాత స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కొరకు తుదివరకు అలుపు ఎరుగని పోరాటం చేసి భరతమాత ఒడిలో ఒరిగిపోయారు.

లాఠీ దెబ్బలు, చెరసాల శిక్షలు వందేమాతర గీతం ముందు తలలు వంచాయి. భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి శ్రమించిన మహనీయుల చరిత్ర మీకు తెలియజేసే ప్రయత్నంగా ఈ “మన కీర్తి శిఖరాలు" పుస్తకాన్ని మీ ముందుకు తెస్తున్నాం.

నిద్రావస్థలోని జాతిని మేలుకొలుపుతూ విజయ శంఖారావం పూరించిన తెలుగు స్వాతంత్ర్య సమర వీరుల త్యాగాన్ని నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యం వారి పోరాటంతో మనకు లభించాయని ఎన్నడూ ఎప్పుడు మరువ కూడదు.

బాలలు ఔషదం తీసుకునే సమయంలో చేదుగా, భాదగా ఉంటుంది. కాని దాని ఫలితం దివ్యమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. విద్య కూడా అంటే చదివే సమయంలో కష్టంగా ఉంటుంది. దాని ఫలితం బంగారు బాటవేసిన జీవితాన్ని ఇస్తుంది.

ఈ మహనీయుల జీవిత చరిత్రలు చదివి ఉత్తమ ఆశయాలతో లక్ష్యం దిశగా కదలండి. రేపటి తరానికి కరదీపికలై దేశ ప్రేమికులుగా, అవినీతి నిర్మూలన సమాజ నిర్దేశకులుగా ఆత్మ విశ్వాసంతో ముందుకు కదలండి. “మన కీర్తి శిఖరాలు"గా ఎదిగి కన్నవారికి, ఉన్న ఊరికి, జన్మ భూమికి పేరు తీసుకురండి.

- బెల్లంకొండ నాగేశ్వరరావు

Preview download free pdf of this Telugu book is available at Mana Keerti Sikharalu