-
-
మన కవులు - మహా కవులు
Mana Kavulu Maha Kavulu
Author: Doraveti (V. Chennaiah)
Publisher: S.R. Book Links
Pages: 304Language: Telugu
‘ఆదికవి’గా పరిశోధకులు నుతుల నందుకొన్న
కవిశ్రేష్ఠుల ఒకరు
సంస్కృతాంధ్ర కవితాపితామహ సత్కవీంద్రులొకరు
అనేక నూత్నప్రక్రియలను ప్రారంభించిన ప్రయోగశీలి ఒకరు
దివ్యమైన కళలను దేవభాషలో అందించిన భవ్యకవి ఒకరు
తొలి వచనరచన చేసిన కవితాగ్రగణ్యులొకరు
తొలి పురాణాన్ని అందించిన అనుపమాన కవి ఒకరు
మొదటి తెలుగు రామాయణ సృష్టికర్త ఒకరు
మొదటిసారి సంయుక్త రచనకు పూనుకున్న కవిశేఖరులొకరు
సంకలన సంప్రదాయాన్ని ఆరంభించిన కవీంద్రులొకరు
కావ్యాన్ని విజ్ఞాన సర్వస్వంగా మలచిన సర్వజ్ఞులొకరు
అచ్చతెనుగు కావ్యాన్ని మెచ్చుకునే రచన చేసిన కవివృషభులొకరు
తెలుగులో తొలి చారిత్రకరచన గావించిన ఉత్కృష్టులొకరు.....
వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవులు.
పదవ శతాబ్దం నుండి ప్రత్యేకరచనలో అగ్రగణ్యులైన
మన పూర్వ కవుల విశేషాలను కథల రూపంలో
అందిస్తుందీ పుస్తకం.
వివిధ ప్రక్రియల్లో విశిష్ట రచనలు చేస్తున్న దోరవేటి
వికారాబాద్ జిల్లా మారుమూల గ్రామవాసి. పాఠకులకు
పరిచయం చేయనవసరం లేని దోరవేటి అసలు పేరు
ఉప్పరి చెన్నయ్య. సృజన, పరిశోధన, చిత్రణలో
తనదైన ముద్రను ప్రదర్శించే కవి, కథారచయిత,
నవలాకారుడు, వ్యాసకర్త, విమర్శకుడు, కళాకారుడు,
పాఠ్యపుస్తక రచయిత అయిన దోరవేటి కలం నుండి
జాలువారిన మరో ఆణిముత్యం
మన కవులు – మహా కవులు.
గమనిక: " మన కవులు - మహా కవులు " ఈబుక్ సైజు 24.4mb

- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹135.6