-
-
మన కలల దిశగా రేపటి భారత్
Mana Kalala Disaga Repati Bharath
Author: K. C. Agrawal
Publisher: Victory Publishers
Pages: 411Language: Telugu
భారతదేశ ప్రజలు అనుభవిస్తున్న ప్రస్తుత ఛిన్నాభిన్న పరిస్థితికి, వారి అంతులేని కడగండ్లకు కారణాలను స్పష్టంగా అవగాహన చేసుకోవటానికి ఈ పుస్తకం మేలుకొలుపు.
ప్రజలు పడుతున్న బాధలు, వాటి పరిష్కారాలు, అవి ఎందుకు నిరుపయోగం అవుతున్నాయో తెలుసుకోవటానికి చేసే పరిశోధనలను గురించి ప్రతివారు గ్రహించడం అనివార్యం. వ్యాధికి మూలకారణాలను తెలుసుకుంటే, చికిత్స తేలిక అవుతుంది. ప్రస్తుత నా యీ పుస్తకం ద్వారా నేను చేసిన ప్రయత్నం అదే.
ఎవరినీ కించపరచటమో, గాయపరచటమో కాక, ఈ పుస్తకం ద్వారా ప్రయోజనాత్మక పరిష్కారాలు కనుగొనడమే నా ఉద్దేశం. కాబట్టి యీ విశేష ప్రయత్నంలో పక్షపాత రహితంగా, న్యాయబద్ధంగా పరిశీలించే ప్రయత్నం చేశాను
వివిధ సమస్యలు - వివిధ కోణాల నుంచి, పార్శ్వాల నుంచి, వివిధ సందర్భాలలో - వివిధ స్థలాలలో చర్చించవలసి రావడం వలన కొన్ని విషయాలు తిరిగి తిరిగి చెప్పవలసి వచ్చింది. ఉద్దేశించిన ఫలితం సాధించడానికే ఇలా చేయవలసి వచ్చింది.
- రచయిత
