-
-
మన చరిత్ర - సంస్కృతి : భిన్న కోణాలు
Mana Charitra Samskruti Bhinna Konalu
Author: Sailaja Bandari
Publisher: Palapitta Books
Pages: 160Language: Telugu
చరిత్ర ఎప్పుడూ గెలిచిన వారిదే. పరాజితులది కాదు. అందుకే మనకీ స్థితి. పరాజితుల గూర్చి కూడా తెలిసినప్పుడే అసలు చరిత్ర మొదలవుతుంది. అప్పుడు పాతచరిత్రను తిరగరాయాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మన భారతదేశానిది ఇదే పరిస్థితి. కాల్పనిక సాహిత్య మయిన పురాణాల నుంచి వెతకడం ఇసుక నుండి తైలం తీయడం లాంటిదే. కల్పనలు, అతిశయోక్తులు, మహిమలు అన్నీ కలగలసిన పురాణగాథలను ఆధారం చేసుకుని వాస్తవంగా జరిగిన చరిత్రను నిర్మించడం కష్టసాధ్యం. అయినప్పటికీ చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తల కృషి వల్ల ఒకనాటి కాలంలోని జీవన పరిస్థితుల ఆధారంగా కొంతవరకు పూర్వచరిత్రని అంచనా వేయగలిగారు. మన పురాచరిత్రను తెలుసుకుని, వక్రీకరణల్ని సవరిస్తూ అసలు చరిత్రని నిర్మించడం అవసరం
సంస్కృతి విషయానికి వస్తే పండగలు, సాంప్రదాయాల పేరుతో రకరకాల మౌఢ్యాలు ‘సంస్కృతి’లో అంతర్భాగమయ్యాయి. దేశంలో అధికశాతంగా ఉన్న శ్రమజీవుల పండుగలు వైదిక ఆచారాలను పోలి ఉండవు. శ్రామిక సంస్కృతి భిన్నమైనది. అది ఇక్కడి మూలవాసీ సంస్కృతి. నేడు సంస్కృతి పేరుతో పెరుగుతున్న మతమౌఢ్యాన్ని అడ్డుకుంటూ, మన మూలవాసుల సంస్కృతిని కాపాడుకోవటం ఇవాళ్టి తక్షణ కర్తవ్యం. ఇందుకోసమే మన చరిత్ర-సంస్కృతిలోని భిన్నకోణాల్ని వివరిస్తూ, శాస్త్రీయ వివేచనకు తోడ్పడే వ్యాసాల సమాహారమిది
