• Malupulu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మలుపులు

    Malupulu

    Pages: 206
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ముంబై మహానగరంలో స్థిరపడి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నవారిలో అంబల్ల జనార్దన్ గారొకరు. "మలుపులు" పేరుతో వెలువడ్తున్న ఈ కథాసంకలనంలో 24 కథలున్నాయి. మూడు అనువాద కథలు కూడా ఈ సంపుటిలో చోటు చేసుకున్నాయి.

ఈ సంపుటిలోని కథలన్నింటిలోనూ ఒక సమకాలీన సమస్యకు కథానికా రూపం ఇవ్వడం కనిపిస్తుంది. కథల్ని సులభశైలిలో, సూటిగా, సాదాసీదాగా చెప్పే నేర్పు అంబల్ల జనార్దన్‌కుంది. కథానికకుండాల్సిన మంచి లక్షణాలైన క్లుప్తత, నిర్మాణ సౌష్టవం, అనుభూతి ఐక్యత, సంఘర్షణ మొదలైనవన్నీ అంబల్ల జనార్దన్ కథల్లో మనకు కనిపిస్తాయి. ఈ కారణాల వల్ల ఈ కథలకు చక్కని పఠనీయతా గుణం అబ్బింది.

- అంపశయ్య నవీన్

* * *

అంబల్ల జనార్దన్ నిశ్వాసంలోంచి ముంబయ్‌లో బ్రతుకుబాటలు చూసుకొంటున్న తెలుగువారి గాథలూ, బాధలూ అక్షర రూపంలో వెలువడి తెలుగు కథా సాహిత్యంలో ఓ విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి. కథనం సరళమైన తెలుగులో వ్రాసినా, సంభాషణలు తెలంగాణ మాండలికంలో వ్రాసినా ఆయనకాయనే సాటి. చదివిన చదువుల మూలానా, చేసిన ఉద్యోగాల మూలానా, గడించిన అనుభవాల మూలానా ఆయన వాణిజ్య, వ్యాపారాల గురించీ, ఆర్థిక వ్యవస్థ గురించీ తన కథల్లో ప్రస్తావిస్తూ, ప్రగతి పథాలను సూచిస్తూ యితోధికమైన పాఠకులకు తెలియని విషయాల్ని తెలియజేస్తారు. ఆయన కథల ప్రత్యేకతకి యిదో కారణం.

- ఎలెక్ట్రాన్ (పింగళి వెంకట రమణారావు)

Preview download free pdf of this Telugu book is available at Malupulu