-
-
మల్లీశ్వరి - సినిమా నవల
Malleeswari Cinema Navala
Author: Raavi Kondala Rao
Publisher: Creative Links Publications
Pages: 128Language: Telugu
వాహినీ సంస్థ విశిష్టమైన కళాత్మక చిత్రం తియ్యాలన్న తలంపుతో నిర్దిష్టంగా నిర్మించిన ‘మల్లీశ్వరి’ 20-12-1951న విడుదలైంది. ఎంతకాలంగానో అటువంటి చిత్రం నిర్మించాలన్న సుప్రసిద్ధ చలన చిత్రకారుడు బి.ఎన్.రెడ్డి ఆశయం సిద్ధించింది. చలనచిత్ర కళ లన్నింటినీ సమన్వయపరచి సర్వ కళామయ చిత్రంగా ’మల్లీశ్వరి’ భాసించి, మనసున మల్లెల మాలలూగించి కన్నుల వెన్నెల డోలలూగించింది. కళారాధకులు, చలనచిత్ర విమర్శకులూ, విద్యాధికులూ, మేధావులూ ’క్లాసిక్’ చిత్రంగా ‘మల్లీశ్వరి’ని అభివర్ణించి శ్లాఘించారు. నటన, సంగీత సాహిత్యాలు, కళ, నాట్యాలూ మొదలైన అన్ని శాఖలూ వైశిష్ట్యంగా, వైవిధ్యంగా ఉన్నత ప్రమాణాల్లో వున్నాయన్న సత్కీర్తితో ’మల్లీశ్వరి’ తెలుగు తెరను అలరించింది. దక్షిణాది భాషలవారే కాకుండా, ఉత్తర భాషల వారూ వీక్షించి మధుర మనోహర ప్రణయ దృశ్యకావ్యంగా ప్రశంసించారు. తెలుగు సినిమా గర్వించదగ్గ చిత్రాలలో ఒక మహత్తర చిత్రంగా కొనియాడబడిన “మల్లీశ్వరి” సంభాషణలు, పాటలతో నవలారూపంలో ’విజయచిత్ర’లో ప్రచురిస్తే అశేష అభిమానులు ఆదరించి, ఆనందించారు. అటు తర్వాత మరిన్ని విశేషాలు, చిత్రాలతో పుస్తకరూపంలో వస్తే బాగుంటుందన్న పెద్దల సలహాతో ’మాయాబజార్’ స్వర్ణోత్సవం సందర్భంగా, ‘మాయాబజార్’ని విడిగా ప్రచురించాము. ఇప్పుడు శ్రీ బి.యన్.రెడ్డి ’శత జయంతి’ సందర్భంగా ’మల్లీశ్వరి’ని కూడా ప్రచురిస్తే సముచితంగా వుంటుందని, అభిమానులు సూచించడం వల్ల మరిన్ని విశేషాలు కలిపి – ‘మల్లీశ్వరి’ని ఇప్పుడు వెలువరిస్తున్నాము. నాటితరం వారితో పాటు, నేటి తరం వారిని కూడా ’మల్లీశ్వరి’ చైతన్యపరచి ఆనందింపజేస్తుందని విశ్వసిస్తున్నాము.
- రావి కొండలరావు
- ₹108
- ₹129.6
- ₹270
- ₹216
- ₹108
- ₹108
Why the process of hiring books is not adopting in recent days?