-
-
మల్లె మొగ్గలు
Malle Moggalu
Author: Dr. J. Seethapathi Rao
Publisher: Self Published on Kinige
Pages: 120Language: Telugu
“అధ్యాపకులు నిరంతర విద్యార్థిగా ఉండాలన్నది సాధారణమాట. అధ్యాపకులు నిరంతర పరిశోధకులుగా కూడా ఉండాలన్నది మా విజ్ఞాన తృష్ణ. కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఉండాలి. ఆచరించడానికి, ఆచరింపచేయడానికి తగిన అవకాశాలను వెదుక్కోవాలి. మీ మీ స్థాయిని, ఆలోచన పరిపక్వతను బట్టి ఇంకా పరిశోధన చేయడానికి తగిన సూచనను మాత్రం ఈ వ్యాసాలు చేస్తాయి. వివిధ శాస్త్ర అంశాలతో సాహిత్య అంశాలను కలిపి సాంకేతిక, సామాజిక, చారిత్రక కోణాల కలబోతతో పాఠకులకు, విద్యార్థులకు, పరిశోధకులకు తగిన విధంగా చదవవలసిన అవసరాన్ని సూచించే దిశే ఈ వ్యాస సంకలనం.
- డా.జె. సీతాపతి రావు, తెలుగు ఉపన్యాసకులు
* * *
ప్రాచీన సాహిత్యంలోని లోచూపును, ఆధునిక సాహిత్యంలోని ఆస్వాదనను ఆసాంతం ఇవ్వడానికి తగిన స్థాయిని ఈ వ్యాసాలు కలిగి ఉన్నాయ్. మానసిక అనునయం, విశ్లేషణ, మనోవిశ్లేషణాదృష్టిని చూపడం ఆధునికత. అన్నీ వైవిధ్యాల్ని సంతరించుకుని ఏ వ్యాసానికి ఆ వ్యాసమే ఒక హిత సూచికలా, సమాచార శోధనతో కూడిన సాంద్రికలా గోచరిస్తున్నాయ్.
- డా. డి.వి. వేణుగోపాల్, మనోవైజ్ఞానిక శాస్త్ర ఉపన్యాసకులు
* * *
సాహిత్య దర్శనానికి ఈ పుస్తకం ఒక ముఖం. వివిధ రకాల అంశాలను ఒక వేదికగా చేసుకుని చర్చించిన ఒక భూమిక. విలువైన తెలుగు పరిశోధనలకు ఉపయోగం.
- శ్రీ డి. చిన్నాజీ వర్మ, రసాయన శాస్త్ర బోధకులు.
