-
-
మైదానంలో మరీచిక
Maidanamlo Mareechika
Author: Dr. Velchala Kondal Rao
Publisher: Viswanatha Sahitya Peetham
Language: Telugu
ఆంగ్ల మూలం: జె. ఎం. గిర్గలానీ
అనువాదం: డా. వెల్చాల కొండల రావు
గిర్గలానీగారి కవితల్లో ఒక వైపు హాస్యం దొరలుతుంది, మరొకవైపు 'self pity' అంటామే, అలాంటిది. అలా నవ్వేవారు, నవ్వుకునేవారు, నవ్వించేవారు చాలా అరుదు. అది చౌకబారు నవ్వు కాదు, చాలా గాంభీర్యమైనది, హుందాతనంతో కూడినది. అలా నవ్వుడం, నవ్వుకోడం, నవ్వించడం అలాంటి హాస్యం, అందరికీ సాధ్యం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే గిర్గలానీగారు మంచి హాస్యప్రియుడు. వారి మాట ఎలాగుంటుందో, వారి వ్రాత కూడా అలాగే ఉంటుంది. అడుగడుగునా ఒక చమత్కారాన్ని జోడించకుండా వారు మాట్లాడలేరు, వ్రాయలేరు. అందుకే వారికి చాలా మంచి ఉపన్యాసకుడని, సంభాషకుడని, రచయితని పేరుంది. వారి సాంగత్యంలో కాలం అలవోకగా దొరలిపోతుంది ఎవరికైనా, ఒక్క మాటలో చెప్పాలంటే. గిర్గలానీగారిలాంటి ప్రతిభావంతులు చాలా అరుదు.
గిర్గలానీగారు పైకి ఎంత సరసంగా, సరదాగా, ఖులాసాగా కనపడతారో లోపల అంత తార్కికుడు, దార్శనికుడు, లోతైన ఆలోచనలు, అనుభూతులు, అనుభవాలు, భావాలు కలవాడు. అనుభవాన్ని ఎంతో దార్శనిక దృష్టి దృక్పథంతో అందించగలవాడు. బైటికి భోగిలా కనబడుతాడు కాని లోపల యోగి లాంటి వాడు. అందుకే ఈ పుస్తకంలో ఎన్నో లోతైన కవితలు వున్నాయి.
- డా. కొండలరావు వెల్చాల

- ₹60
- ₹288
- ₹432
- ₹144
- ₹240
- ₹60