-
-
మహాత్మా జీసస్
Mahatma Jesus
Author: Sri Sarvari
Publisher: Master Yogaashram
Pages: 204Language: Telugu
ఓ మహాత్మా! ఓ మహర్షీ!!
"నాకు మతం లేదు... నాకు మరణం లేదు."
అన్నది జీసస్ ప్రవచనం.
మతం నీడ సోకనివాడు మహాత్ముడు.
మతాలకు అతీతమైనవాడు మహర్షి.
పారమాత్మిక స్పృహతో, చైతన్యంతో జీవించేవాడు మహాత్ముడు.
మరణాన్ని జయించినవాడు మహర్షి. జీసస్ మహర్షి, మహాత్ముడు, కారణజన్ముడు, అవతారపురుషుడు.
ఇది జీసస్ చిత్రచయనికకు కొత్తరంగులద్దిన రచన.
ఇది కాలగర్భంలో దాగిన చారిత్రక రహస్యాలను శోధించి, పరిశోధించి, పరిష్కరించి, అవిష్కరించిన రచన.
జీసస్ జీవితం ఒక కోణం.
క్రీస్తు తాత్వికత మరొక కోణం.
జీసస్ జీవితంలో ప్రతి మలుపులో ఒక మెరుపు... బోధనల్లో అంతర్లీనంగా తళుకొత్తిన తాత్వికత.
అయన ఆలోచనల్లో భారతీయ తాత్విక సత్య రోచిస్సుల గుభాళింపులు...
అనుభూతుల్లో 'ఆర్ష' సంస్కృతీ పారమాత్మిక స్పృహ.
ఇది జీసస్ మూలసూత్రాలకు మౌళికభాషణ...
క్రీస్తు తాత్వికతకు సరికొత నిర్వచన రచన.
