-
-
మహాతలం.. మాయాదర్పణం
Mahatalam Maya Darpanam
Author: Sreesudhamayi
Publisher: Manrobo Publications
Pages: 75Language: Telugu
ఒక్కసారిగా ప్రకృతి విలయతాండవం... దట్టంగా అలుముకున్న మేఘాలు.. కుంభవృష్టి.
ఆ మెరుపుల్లో పర్వతప్రాంతంలో భూమిలోపల చిన్న కదలిక. భూమి కంపిస్తుంది. రెండుగా చీలుతుందా అన్నంత భయానక వాతావరణంలో భూమి పొరలను చీల్చుకుని మా...యా...ద...ర్ప...ణం బయల్పడింది.
కుండపోతగా కురిసేవర్షానికి మాయాదర్పణం మీద వున్న బురద తొలిగింది.
ఆకాశంలోని మెరుపులు.. కుంభవృష్టి మేఘాలు ఒక్కసారిగా ఏదో బలమైన శక్తి లాగినట్టు మయాదర్పణంలోకి లాగబడ్డాయి.
మాయాదర్పణంలో ఏ ప్రతిబింబం కనిపిస్తే ఆ ఆకారాన్ని మాయాదర్పణంలోనికి లాగేస్తుంది.
మరుక్షణం ఆ మయాదర్పణాన్ని భూమి తనలోకి లాక్కుంది. ఆకాశంలో మెరుపులు మేఘాలు మాయమయ్యాయి.
మహాతలంలో అదృశ్యమైన పరమశివుడి వరప్రసాదమైన మాయాదర్పణం భూలోకానికి ఎలా వచ్చింది?
మంత్రవాదుడి మరణాహస్యం ఏమిటి?
మహాతలానికి చేరిన విజయసేనుడు ఏమయ్యాడు ?
మాయామంత్రాలతో మిమల్ని మహాతలానికి తీసుకువెళ్ళే..
శ్రీసుధామయి మరో జానపద నవల.. మహాతలం... మాయాదర్పణం
మేన్ రోబో పబ్లికేషన్స్ సగర్వ సమర్పణ
జానపదాల నవలా ప్రపంచంలో సరికొత్త నవల ...మహాతలం మాయాదర్పణం .చిన్నపుడు చాలా ఇష్టంగా చదివే జానపద నవలలు అంతే ఇష్టంగా చదివిస్తున్నాయి శ్రీసుధామయి నవలలు.మాయామంత్రాలు టక్కుటమారా విద్యలు ,చదివించే మంచి శైలి.కీపిటప్ .
నవల చాలా బావుంది.శైలి బావుంది.ముఖ్యంగా కథను నడిపించినతీరులో రచయిత్రి ప్రతిభ కనిపించింది.కనుమరుగైన జానపద నవలలను మళ్ళీ వెలుగులోకి తీసుకువస్తున్న కినిగెకు అభినందనలు.
విఠలాచార్య గారి సినిమా చూస్తున్నట్టు వుంది.జానపద నవలలు మళ్ళీ మా ముందుకు తీసుకువచ్చిన కినిగెకు ధన్యవాదాలు.శ్రీసుధామయి గారి కలం నుంచి మరిన్ని జానపద నవలలు రావాలని కోరుకుంటున్నాం.
సూపర్బ్ నవల ...వెరీ ఇంట్రెస్టింగ్ .థాంక్స్ టు కినిగె
super navala.mee anni navallu chadivanu.pachalaloya mayadveepam navalalu chala bavunnayi.keep it up