-
-
మహారాజశ్రీ మామ్మగారు
Maharajasri Mammagaru
Author: Mannem Sarada
Publisher: J.V.Publications
Pages: 232Language: Telugu
పాఠకులూ, ప్రేక్షకులూ కూడా మన్నెం శారదగారి నవలల్లో పది దశాబ్దాలుగా ఓలలాడుతున్నారు. ఐనా నేటికీ ఆమె కలం వన్నె తరగలేదు. ప్రముఖ తెలుగు పత్రికలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో శ్రీమతి శారదగారి నవలలకీ, కథలకీ ప్రధమ బహుమతులు చాలానే అందాయి. చివరికి సైన్స్ ఫిక్షన్ పోటీలలో కూడా ఆమె విజయం సాధించారు. నలభైకి పైగా నవలలు, వెయ్యి దాకా కథానికలు రాసినా.. ఆమె చిన్ననాట ఎత్తిన కలం యింకా దించలేదు. కన్నడ పాఠకులకి కూడా ఆమె అభిమాన రచయిత్రే!
బల్లితెర స్క్రిప్టు రచనలలో కూడా శ్రీమతి శారదగారిది అందె వేసిన చెయ్యి. రెండు చేతులా రెండు ‘నంది’ అవార్డులు అందుకున్నారు. లెక్కకు మించి లభించిన అవార్డులు, రివార్డులతో ఆమె డ్రాయింగ్ రూమ్ ఒక మ్యూజియంలా వెలిగిపోతూ వుంటుంది. ‘కలం’కారీ విద్యలోనేగాక, ‘కుంచె’ కౌశలంతో వర్ణచిత్రాలు చిత్రించడం ఆమె హాబీ! అందువల్లనే కనులకు కట్టినట్టు సన్నివేశ కల్పన చేయగల నైపుణ్యం అబ్బింది. ప్రస్తుతం శారదగారు తన కుంచెను కంప్యూటర్ తెరమీద కదిలిస్తూ అద్భుతాలు సష్టిస్తున్నారు.
ప్రస్తుతం పాఠకులు అందుకుంటున్న ఈ నవల హాస్యరస ప్రధానమయిన సాంఘిక ‘చిత్రం’. హాస్యరసాన్ని పండించడం గొప్ప కష్టం. కాని శ్రీమతి శారద యీ నవలను ఆద్యంతం మానసోల్లాస భరితంగా పరుగులు తీయించారు.
- వీరాజీ
