-
-
మహాదేవి వర్మ గీతాలు
Mahadevi Varma Geetalu
Author: Dr. Chaganti Tulasi
Publisher: Chaso Sphurthi Prachuranalu
Pages: 143Language: Telugu, Hindi
ఈ అనువాదాల్లో చాగంటి తులసి గారు కనపర్చిన శ్రద్ధనీ, ప్రజ్ఞనీ కూడా ప్రస్తుతించవలసి ఉంది. ఆమెలో ఇంత కవిత్వ సౌకుమార్యం ఉందని తెలియదు. మూలంలోని సంగీతాన్ని తెలుగులోకి తీసుకురావడం కష్టమే. కానీ ఆ సంగీతమెటువంటిదో సూచించగలగడంలో అనువాదం సఫలమయ్యింది. చాలాచోట్ల మూలంలోని సున్నిత శబ్దఛాయల్ని, అర్థ ఛాయల్ని తెలుగులో మరింత సుసంపన్నంగా ప్రకాశపరచగలిగింది.
ఉదాహరణకి 'ఫూల్ కొ ఉర్ మే ఛిపాయే వికల్ బుల్ బుల్ హూ' అనే వాక్యాన్ని తెలుగు చేసినప్పుడు 'అయినను కలతల పికిలి పిట్టను నేను' అనడం చూడండి. 'వికల్ బుల్ బుల్' 'కలతల పికిలి పిట్ట' గా కనిపించేటప్పటికి నాకు రోమాంఛితమైంది. ఇట్లాంటివెన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు.
'ఉతరో అబ్ పలకోం మే పాహున్' అనే వాక్యం 'దిగిరా ఇక ఇప్పుడు రెప్పల పయికి ఓ అతిథీ' అనే మూడు పంక్తులుగా మారినప్పుడు అందులో ప్రియాహ్వానమే కాదు, ఒక అవతరణ దృశ్యం కూడా ఆవిష్కృతమైంది.
- వాడ్రేవు చినవీరభద్రుడు
