-
-
మహాభారతసారసంగ్రహము
Mahabharatasarasangrahamu
Author: Pullela Sriramachandrudu
Publisher: P. S. Sastri
Pages: 1072Language: Telugu
లక్ష శ్లోకాలున్న మహాభారతాన్ని చదవాలంటే పండితులకు కూడ కష్టసాధ్యమైన విషయం. మహాభారతంపై విమర్శనాత్మక వ్యాసాలున్న అనేక గ్రంథాలున్నాయి కాని భారతం సమగ్రస్వరూపం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం చెప్పే గ్రంథం తెలుగు వచనంలో లేదు. గద్యరూపంలో సంపూర్ణమైన అనువాదాలు ఒకటి రెండు ఉన్నా అవి అనేక సంపుటాల్లో ఉండడం వల్ల పాఠకుల ఆదరణ పొందలేకపోయాయి. ప్రస్తుత గ్రంథం ఈ లోటును, అవసరాన్ని తీరుస్తుంది. భారతంలోని అన్ని విషయాల్నీ స్పృశిస్తూ ఆధునిక పాఠకుడికి మహాభారతతత్త్వాన్ని, భారతీయ ఆత్మను ఆవిష్కరిస్తుంది.
భారతంలాంటి గ్రంథాన్ని యథాతథంగా వివరించడానికి రచయితకు ఎంతో ఋజుస్వభావం, నిబద్ధత, ధైర్యం ఉండాలి. ప్రస్తుత గ్రంథంలో ఈ స్వభావం ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. నిష్టురమైన సత్యాలను యథాతథంగా అందించంవల్ల అసత్యప్రచారాలు, అభిప్రాయాలు, అవగాహనలు తొలగించడం జరిగింది. ఆధునిక విశ్లేషకులకు, భారతంపై పరిశోధన చేయదలచినవారికీ ఈ గ్రంథం ఒక ముఖ్యసాధనంగా ఉపయోగపడుతుంది. మూలగ్రంథంలోని సుమారు వేయిశ్లోకాలకు పైగా ఉటంకించడం వల్ల ప్రామాణికంగా ఎక్కడ ఏం చెప్పబడిందో అవగత మవుతుంది. ముఖ్యంగా విదురనీతి, రాజనీతిధర్మాలు మొదలైన సందర్భాల్లో కంఠస్థం చేయాల్సిన అనేక శ్లోకాలు ఇందులో కన్పిస్తాయి. మహాభారతంలోని సంపూర్ణవస్తుతత్త్వాన్ని మనకు అందించే గ్రంథం ఇది.
మన సంస్కృతికీ, బౌద్ధిక వారసత్వానికీ సమాజం దూరమవుతున్న సందర్భంలో ఇలాంటి గ్రంథం మన సమాజ పునరుజ్జీవనానికి, ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని జీవింపచేయడనికి ఎంతో అవసరం.
- డా॥ కరణం అరవిందరావు
