• Mahabharatam Manchi Chedu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహాభారతం మంచీ - చెడూ

    Mahabharatam Manchi Chedu

    Pages: 62
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేను నాస్తికుడిని కాదు కానీ, 'మహాభారతం' చాలాచాలాసార్లు చదివాక మాత్రం దీన్లో పూర్తిగా వాస్తవం కంటే, రచయిత కల్పనా శక్తే ఎక్కువగా ఉందీ అని నమ్ముతున్నాను.
భగవాన్ వేదవ్యాసులవారైతే, ఇలాగే రాసుండకపోవచ్చని నా అభిప్రాయం.

ఎందుకంటే, మన కవిత్రయం వారు అనువదించిన కథ కూడా సంస్కృత గ్రంథాలకి అనువాదం.
ఆ గ్రంథాలని వేదవ్యాసుల వారు కానీ, వారి శిష్యులు కానీ వ్రాయలేదు.
వీటిని వారి సమకాలీకులు కూడా రచించలేదు.

అంటే, అప్పటికే కొన్ని భాగాలు మార్పు చెంది ఉండచ్చు. కొన్ని భాగాలు నిక్షిప్తం అయ్యుండచ్చు. మరికొన్ని భాగాలు ప్రచ్చన్నంగానే ఉన్నా, 'సెన్సార్ ' కి గురై ఉండచ్చు.

మూలకథ మార్పు చేయకుండా, వేరేలా ఎలా చేసినా, ఫరవాలేదని అనుకునుండచ్చు.

రామాయణం, భాగవతాలపై ఇలాంటి అనుమానాలు రాలేదు. ఎందుకంటే, రామాయణం మొదట్లోనే "ఇన్ని సద్గుణాలు కలిగిన వ్యక్యి ఎవరైనా ఉన్నాడా? ఉంటే ఎవరు? ఏమా కథ?" అనే ప్రశ్నల తోనే ప్రారంభం అవుతుంది. అలాంటి వాడు ప్రస్తుతం రాజ్యం చేస్తున్న శ్రీరాముడే అని తెలుసుకున్నాక, అని శ్రీ వాల్మీకి మహర్షి తెలుసుకున్నాక, రామాయణ రచన ప్రారంభం అవుతుంది.
రామాయణం అంటే రాములవారి కథే! ఆ శ్రీమన్నారాయణుని కథే!

అలాగే భాగవతం కూడా! ఆయన పుట్టినప్పుడే తన చతుర్బుజ రూపాన్ని ప్రదర్శిస్తాడు. దేవకీ వసుదేవుల కోరికపై, ఆ రూపాన్ని ఉపసంహరించుకుని, చిన్ని కృష్ణుడుగా మారిపోతాడు. కాబట్టి ఆయన కూడా మానవాతీత శక్తుల్ని ప్రదర్శించ గలడు!

కానీ ఈ 'మహాభారతం ' చదివినప్పుడు అనేక అనుమానాలు వస్తున్నాయి.
నేనేమీ 'ఆత్మవిదుణ్ణి ' కాకపోయినా, అనుమానాలు తీర్చేసుకునే అవకాశం వదులుకోకూడదు కాబట్టీ, కనీసం ముందు తరాలవారైనా నా అనుమానాల సారాంశాన్ని గ్రహించి, వాటిని తీరుస్తారనే ఉద్దేశ్యంతో, పెద్దల ముందుకి నా అనుమానాలని తీసుకొస్తున్నాను.

- ప్రసాద్ మైలవరపు

Preview download free pdf of this Telugu book is available at Mahabharatam Manchi Chedu