• Mahabharatam Manavadharmam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 162
    180
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహాభారతం - మానవధర్మం

    Mahabharatam Manavadharmam

    Pages: 274
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

మహాభారతం ప్రబోధించిన మానవధర్మాన్ని ఆవిష్కరించే దిశలో, నానా ఉపాఖ్యానాలున్నా, అందులో కొన్నిటిని ఎంచుకుని వాటిని సుందరక్లుప్తంగా విశ్లేషించి తొలి భాగాన్ని ధర్మబద్ధం చేసిన వారు డా.డి. విద్యేశ్వరి, డా.ఐ.వి.కాంతలక్ష్మి గార్లు. ఏకాదశ విభాగమైన ప్రధమ భాగం, లోకధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో ప్రబోధిస్తుంది. రెండవ భాగమంతా అధ్యాత్మ ధర్మాన్ని, కర్మ, భక్తి, జ్ఞాన, ధ్యాన, సన్యాస యోగం అనే శీర్షికలలో విపులంగా ప్రస్తావించిన వీరిద్దరూ అభివందనీయులు.

సర్వధర్మాలకు మూలమైన కృష్ణపరమాత్మ నిర్వహించిన అనుపమాన పాత్రను బహుకోణాలలో స్పృశించి సత్య-ధర్మ నిష్టలో వున్న పాండవుల పక్షాన పరమాత్మ వుండటాన్ని ప్రస్తావించి, నర నారాయణీయాన్ని రమణీయం చేశారు. కర్మఫలాసక్తి లేని వాడు కర్మలను అంటించుకోకూడ ఏవిధంగా ఈ లోకంలో జీవిస్తారో తెలుసుకోవాలంటే, కృష్ణ చరితమే ప్రమాణం! ఇది మూడవ భాగం!

లౌకిక, అలౌకిక, పారలౌకిక, పారమార్ధిక, అధ్యాత్మ ప్రబోధం వాసుదేవుడి అవనీ సంచారంలో పల్లవించిన తీరును, సందర్భాలను, సన్నివేశాలను, సంఘటనలను మరొక్కసారి పరిచయం చేస్తూ, సర్వభావనా సమాహారంతో ఈ గ్రంథం పూర్తవుతుంది.

ధర్మ స్వరూప నిరూపణ, ధర్మ ప్రతిపాదక, ధర్మ ప్రబోధ, ధర్మాచరణ, ధర్మ ప్రసారవాహినీ స్వరూపాన్ని సంతరించుకున్న ఈ గ్రంథం ఆధునికులకు అరచేతి అమలకం! ప్రధానంగా యువలోకం సందేహాల సంపుటిగా, ప్రశ్నించటం అలవాటు చేసుకున్న నూత్నజాతిగా రూపాంతరం చెందుతున్న వేళ, దేనినీ చదవకుండనే పాతదంతా పనికిరాదనే భావం వేళ్ళూనుకుంటున్న వేళ ఈ గ్రంథం సందేహ నివారణం చేసి, ధర్మాసక్తి కలిగిస్తుంది.

- వి.యస్‌.ఆర్‌.మూర్తి

Preview download free pdf of this Telugu book is available at Mahabharatam Manavadharmam