-
-
మహాభారత విమర్శనము
Mahabharata Vimarsanamu
Author: Puttaparthi Narayanacharyulu
Publisher: Self Published on Kinige
Pages: 274Language: Telugu
జగమంతయు వ్యాసోచ్ఛిష్టమన్నారు పెద్దలు. ఎన్ని మహా పర్వత శిఖరములనైనను - యెన్ని మహాసముద్రముల నైనను నూహించవచ్చును. కాని - వ్యాసుని మేధస్సు నూహించుట కష్టము. అతని సృష్టి యెంత విస్తృతమో అంత గంభీరము. ఎంత గంభీరమో అంత విస్తృతము. అందుకే పూర్వులాతని నారాయణ స్వరూపుడనిరి. భగవద్వ్యాస రచితములని చెప్పబడు వానిలో గొన్ని వారివి గాకపోవచ్చును. స్కాందపురాణములో చాల భాగ మాతనిది గాదనియే యనిపించును. అతని రచనము లనిపించువానిలో గూడ నతని మార్పెంతయో తరువాతి వారి చేర్పెంతయో యిదమిత్థమని తేల్చుట “గగనం గగనాకార”ముగా నుండును. అనేక ప్రతులలో ననేకములగు క్రొత్తశ్లోకములువచ్చును. నేను నాదగ్గఱనున్న ప్రతినిబట్టియే యీ రచనమునకు బూనుకొన్నాను. నే నుద్ధృతీకరించిన శ్లోకములు గొన్నింటిలో లేక పోవచ్చును. మఱికొన్నింటిలోఁ గ్రోత్తశ్లోకము లుండవచ్చును.
వ్యాసుని రచన చాల ప్రౌఢమైనది. ఓజోగుణ మెక్కువ. వాల్మీకివాణి ప్రసన్న లలితము. ఆ కథ నర్థము చేసికొనుటయు సులభమే. భారతమున ననేక సమస్యలు. సమస్యలకన్నను గ్లిష్టమైనది యాతని రచన. ఏదో నాశక్తికొలది యుపాసించినాను. భారతమున గొన్ని ప్రతులలో వస్త్రాపహరణకథయే లేదట. వస్త్రాపహరణమే భారతయుద్ధమునకు బ్రచోదకశక్తి. దానినే గాదన్నచో నిక భారతయుద్ధము నూహించుటయే కష్టము. నాయీ విమర్శనములు సర్వసమ్మతములుగ నుండవలెనను పేరాస నాకు లేదు. దానిలో నా రాగద్వేషములు ప్రతిఫలించి యుండవచ్చును. కొన్ని యెడల నా దృష్టి సంకుచితమైయుండవచ్చును.
మహాభారతముపై గృషియొనర్చిన మేధావు లెందరో గలరు. వారిలో నొక్కొక్క రొక్కక్క మహాపర్వతము. నావంటి యల్పజ్ఞునకు వారితో సామ్యము లేదు. చాలవఱకు వారి కృషి నంతయు నే నీ గ్రంథమున వాడుకొన్నాననియే చెప్పవచ్చును. ఈ రచనమున నా ప్రత్యేకత యేమియు లేదు. వారి భావముల నొక మాలగా గూర్చి మీ యెదుట నుంచితినంతే. మహారాష్ట్రులెందఱో మహాభారతముపై విమర్శనము లొనర్చినారు. వారిలో ముఖ్యముగ “హరిదాసుబాళాశాస్త్రి” గారి పేరు చెప్పవలసియున్నది. వారికి నా ప్రత్యేక కృతజ్ఞత. గ్రంథము ముందున్నది. సహృదయులు చదివి సౌజన్యముతో విమర్శించినచో ధన్యుడను.
- పుట్టపర్తి నారాయణాచార్యులు

- ₹270
- ₹378
- ₹72
- ₹108
- ₹216
- ₹72