• Mahaa Manjira Naadam
 • Ebook Hide Help
  ₹ 60 for 30 days
  ₹ 216
  240
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • మహామంజీరనాదం

  Mahaa Manjira Naadam

  Pages: 190
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

కళారసాస్వాదన లేని జీవితం నిరర్థకం అని మరీ అంత కటువుగా అనలేను, కానీ రసప్రపూర్ణ సంజీవదేవ్ చెప్పినట్లు ఎండు బ్రతుకు అనక తప్పదు. సంక్షుభిత జీవనయానంలో పచ్చని తరుఛాయ కళాస్వాదన. రకరకాల కల్లోలాలతో బ్రతుకు బండబారకుండా మరుటెడారిలో చలిచెలమలాగా రక్షిస్తుంది కళ. మోడుల అంతరాంతరాలలో అణగారి ఉన్న జీవశక్తిని కదలాడజేసి చిగుళ్ళు, ఇగుళ్ళు మోసులెత్తేటట్లు చేయగల శక్తి కళకు ఉందని నా ప్రగాఢ విశ్వాసం.

కళను అభిమానించగలిగినవాడు, కళను ఆస్వాదించగలిగినవాడు జీవితంలో మిగిలినవారికన్నా భిన్నంగా ఉంటాడు. మాటలో, చేతలో, నడతలో వక్రత తగ్గుతుంది. మనిషితనం పెరుగుతుంది. ఎద మెత్తనవుతుంది.

కఠినశిలా సదృశ్యమైన గుండెని, చినుకే ఎరుగని పర్రవంటి చిత్తాన్ని, తెలియని అసంతృప్తి జ్వాలలతో నిరంతరం దహించుకుపోయే మనసుని, ఉత్తుంగతరంగాల పోలు రాగద్వేషాలతో ఘూర్ణిత సముద్రం వంటి హృదిని, చుట్టుముట్టిన సమస్యల పెనుగాలులతో అతలాకుతలమయ్యే ఎడదను కళ శాంతింపచేయగలదు. భౌతికమైన వాటిని కదిలించగలదని చెప్పే కథల కన్నా ఈ విషయం నిశ్చయం, ప్రత్యక్ష సత్యం. సమస్త ఆంతరిక సంక్షోభాలను_ శాశ్వతంగా కాకపోయినా వాటి సాన్నిధ్యంలో ఉన్నంతసేపైనా- అరికట్టి హృదికి స్వాంతన కలిగించే శక్తి, చిత్ చైతన్యం రగిలించగల శక్తి కళకి ఉన్నది. ముమ్మాటికీ ఉన్నది.

ఇటువంటి కళలను తాము నేర్చుకొని, నలుగురికీ నేర్పుతూ కళా వారసత్వాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులు ధన్యులు. ఆ ధన్యులలో కాజ వేంకట సుబ్రహ్మణ్యం కూడా చేరతారు. తను నమ్మిన కళారంగం నాట్యం. శ్రీ సాయిమంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ద్వారా ఆర్థికానికన్నా హార్దికతకు ప్రాధాన్యతనిస్తూ చేస్తున్న సేవ, సాగిస్తున్న యాత్ర ప్రత్యక్షంగా తెలిసిన వారిలో నేనొకణ్ణి.

సుబ్రహ్మణ్యం మహామంజీరనాదం తలపెట్టినప్పుడు మృదుభాషి, మృదుతరస్వభావి అయిన వీరు యీ యజ్ఞసదృశ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా తుదముట్టించగలరా అని సందేహించినవారిలో నేనూ ఉన్నాను. మిత్రుల భయాందోళనలను విరిసిపోజేస్తూ నాట్యక్రతు కలాపమంతా దిగ్విజయంగా పూర్తిచేసి సంతోషావబృధస్నాన సంతుష్ట హృదయులయ్యారు సుబ్రహ్మణ్యం. ఆ కార్యక్రమం పేరు మహామంజీరనాదం. దశదిశలా ఈ నాదం వ్యాపింపజేయాలని పదిరోజులపాటు నిర్వహించారు. ఒక గంటసేపు నిరంతరాయంగా నాట్యం చేయగలమా అనే భయ సందేహాలను వర్ధిష్ణు కళాకారులలో తొలగింపజేశారు. నాట్యాచార్యులు వారి శిష్యులను చక్కగా మలచి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సంపూర్ణంగా సహకరించారు.

ఆ సందర్భంగా ప్రచురించదలచిన వ్యాస సంకలనమే ఈ మహామంజీరనాదం. ఇప్పటికి సుసంపన్నమయ్యింది. ఈ సంకలనంలో భారతీయ నాట్యాల గురించి, నాట్యధర్మంలో తరచూ ప్రస్తావనకొచ్చే అంశాలలో కొన్నింటి గురించి పాఠకులకు తెలియచేయడానికి ప్రయత్నించాము. ప్రదర్శిస్తే చూడటానికి రెండు కళ్ళూ చాలని, ప్రదర్శన విధానం అచ్చులో చదవడానికి విసుగ్గా ఉండే పద అభినయం, తిల్లాన అభినయం వంటి వాటిని కూడా నాట్యజిజ్ఞాసువుల నిమిత్తం ఈ సంకలనంలో చేరాయి.

ఇంకా అనేక అంశాలు ఈ సంకలనంలో చర్చకు రాలేదని సంపాదకమండలికి తెలుసు. అయితే ఇదే మా చివరి ప్రయత్నం కాదు. ప్రతి రెండేళ్ళకు మహామంజీరనాదం ప్రదర్శన, ముద్రణ జరపాలని ఆశిస్తున్నాము. మిత్రులు, కళారాధకులు, అభిమానులు ఇచ్చే స్థైర్యంతో ఈ మహత్కార్యం తప్పక జరుగగలదు.

సంపాదకమండలి తరఫున…

- రవికృష్ణ

గమనిక: "మహామంజీరనాదం" ఈబుక్ సైజు 29.6 MB

Preview download free pdf of this Telugu book is available at Mahaa Manjira Naadam