-
-
మహాగురు
Mahaa Guru
Author: Sri Sarvari
Publisher: Master Yogaashram
Pages: 200Language: Telugu
ఈ పుస్తకంలో ఉన్నది నేను - నా హృదయం - నా మనస్సు - నా తపన - నా తపస్సు - నా ఆవేదన - నా నిర్వేదం. ఇది నా బాహ్యజీవిత చిత్రణ కాదు. అంతరంగ ఆవిష్కరణ. ఇందులో కథలుండవు, వ్యథలుండవు, సంఘటనలుండవు. అంతరంగ ఆవిష్కరణలుంటాయి. ఇది ఆంతరిక ప్రబంధం (ఈసాటరిక్ వరల్డ్) ఆంతరంగ తరంగం. ప్రతి పుటలోనూ కనిపించని కధలున్నాయి, వినపడని వ్యథలున్నాయి, కొన్ని కలలున్నాయి. కరిగిపోయిన కలలున్నాయి. మృత్యునీడలున్నాయి. స్వర్గం తాలూకు ఛాయలున్నాయి. భయాలున్నాయి. అభయాలూ ఉన్నాయి. అనంతర యాత్రకు ఆహ్వానాలున్నాయి.
గుర్జిఫ్ అనే అధునాతన తత్వవేత్త జీవితాన్ని ఇలా విశ్లేషిస్తాడు:
There are basically three ways for growth and maintenance of the Soul.
1. The way of a Yogi - that of the Mind
2. The way of the Monk - that of the Heart
3. The way of the Fakir ... comprising the Body.
ఈ మూడు మార్గాలనూ ఒక్కటిగా చేయడం నాల్గవ మార్గం. అది శూన్యతకు, మార్మికతకు మధ్య దారి - రహదారి. ఈ పుస్తకంలో ఏం చెప్పానో నాకు తెలియదు. ఏం రాశానో తెలియదు. ఒక మహాగురువు నన్ను ఆవహించి పలికించిన మాటల మూటలు ఇవి.
- శార్వరి
