• Maha Swapnam Mahatma Gandhi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మహాస్వప్నం మహాత్మాగాంధీ

    Maha Swapnam Mahatma Gandhi

    Pages: 135
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మరోసారి మహాత్మాగాంధీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యారు - ఆయన 150వ జయంతి సంవత్సరం కావడం ఒక పార్శ్వం కాగా, సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ 2019 సందర్భంలో గాంధీజీ సిద్ధాంతాల ఔన్నత్యాన్ని, ఆలోచనా ధోరణిని మరింతగా విశ్లేషించారు, గౌరవించారు. ఇక విదేశాలలో అయితే ఐదారు దశాబ్దాలుగా ఎంతో మంది శోధించారు, ఎన్నో పుస్తకాలు వెలుగు చూశాయి. అటువంటి ఆలోచనా శీలి, సిద్ధాంతకర్త భారతీయ ఆత్మ తెలిసిన మహాత్మాగాంధీ గురించి మొన్నటితరం సంపాదకుడు, రచయిత, ప్రజ్ఞా దురంధరుడు నార్ల వెంకటేశ్వరరావు రచించిన సంపాదకీయాల సంపుటి ఈ ‘మహాస్వప్నం మహాత్మాగాంధీ’.

“...వ్యక్తుల ద్వారా గౌతమబుద్ధుడు ఏసుక్రీస్తు అహింసా సిద్ధాంతాన్ని ప్రయోగిస్తే, సంఘం ద్వారా గాంధీ వాటిని ప్రయోగించారు…”.

“...కౌటిల్యుడు, మాకియవిలీ మొదలైన రాజనీతి తంత్రజ్ఞుల విధానాలు ఖండించడానికే గాంధీజీ జీవించారు, మరణించారు…”.

ఈ స్థాయిలో చేసిన విశ్లేషణల సమాహారమిది. 1944 - 1973 సం. మధ్య నార్ల వెంకటేశ్వరరావు రచించిన పదకొండువేల రచనల నుంచి ఎంపిక చేసిన ముప్పయి మూడు మేలిమి సంపాదకీయాలు ఇవి. ప్రముఖ కాలమిస్టు, సైన్సు రచయిత, ఆకాశవాణి ప్రయోక్త డా. నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం వహించిన ఈ సంకలనంలో జవహర్ లాల్ నెహ్రూ, విన్సెంట్ షీన్, అనుబంధోపాధ్యాయ రచనలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ పుస్తక సంపాదకుడు రచించిన మరో ఆరు విశ్లేషణలు అదనం. 2019 ఆగస్టులో తొలి ముద్రణ రాగా, రెండవ ముద్రణ అదే సంవత్సరం డిసెంబరులో రావడం విశేషం.

గాంధీజీకి సంబంధించి చాలాకాలం తర్వాత తెలుగువారిలో కొత్త ఆలోచనలు రావడానికి దోహదపడిన పుస్తకమిది. ఈ పుస్తకం వెలువడిన తర్వాత ఎంతోమంది కొత్తగా ఆలోచిస్తున్నారు, గాంధీజీ గురించి రచనలు చేస్తున్నారు.

- నాగసూరి వేణుగోపాల్

గమనిక: " మహాస్వప్నం మహాత్మాగాంధీ " ఈబుక్ సైజు 5mb
Preview download free pdf of this Telugu book is available at Maha Swapnam Mahatma Gandhi