-
-
"మహా నటి" సినిమా ఆ 'నటి'కి న్యాయం చేయదు!
Maha Nati Cinema Aa Natiki Nyayam Cheyadu
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 206Language: Telugu
• *'పెళ్ళి కాని' యువతి, పెళ్ళి చేసుకునే ముందు, తనకు భర్త కాబోయే వాడి ప్రవర్తన 'ఫలానా రకం' అని తెలిసినా, ఆప్పుడు కూడా ఆమె, అతని వ్యభిచార ప్రవర్తనని పట్టించు కోనక్కరలేదా? భార్యగా సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రమే భర్తతో సంబంధాల గురించి ఆలోచిస్తుందా? ఎలా వుంది సినిమా సావిత్రి జవాబు? "నేను నీ భార్యగా వున్నాను కాబట్టి, నన్ను ఇప్పుడు మోసం చెయ్య కూడదు" అంది. మరి, తను అతనికి భార్యగా మారాలను కున్నప్పుడు, అతనికి అప్పటికే తాళి కట్టించు కున్న భార్య వుందని ఈమెకి తెలుసు కదా? అతడికి తను కొత్త భార్యగా అవడం అంటే, అతడు మొదటి భార్యని మోసం చేస్తున్నాడనీ ఆ మోసంలో తను కూడా భాగస్తురాలిని అవుతున్నాననీ అర్థమే కదా? అది సావిత్రికి అప్పుడు తెలియదా?
• భూమి మీద చెట్లు, క్రిమి కీటకాలూ, జంతువులు, పుట్టడానికి, ప్రకృతి సహజ కారణాలు వుంటాయి. కాని, 'కుల విధానం' ప్రారంభం కావడానికి ప్రకృతి కారణాలు వుండవు. ఆ కారణాల్ని, మానవ సమాజంలో సాగే 'శ్రమ సంబంధాల్లో' వెతక వలిసిందే. ఆ విధానాల్ని పరిష్కరించే మార్గాలు, సమాజంలోనే వుంటాయి. ఆ పరిష్కారాల్ని తెలుసుకోకపోతే, ఎన్ని వేల సంవత్సరాల వరకైనా, ఆ విధానాలూ, ఆ ఘర్షణలూ, అలాగే వుంటాయి.
• వీరేశలింగం గారు, స్త్రీల కోసం ఏం చేశారో, ఇక్కడ ఇంకా చెప్పనక్కరలేదు. ఆనాటి బ్రాహ్మణులెందరో, ఆయన సంస్కరణలకు అడ్డాలు పడ్డారు. ఆయన్ని వెలివేశారు. ఆయన ఒక్క దాన్నికూడా లెక్క చెయ్యలేదు.
• సమ్మెల గురించి మార్క్సు : “పెట్టుబడితో తమ అనుదిన ఘర్షణలో, కార్మికులు పిరికి వారై, వెనుకంజ వేసినట్టయితే, అంతకన్నా పెద్ద ఉద్యమాన్ని దేన్నీ ప్రారంభించే అర్హతను తప్పని సరిగా కోల్పోతారు."
• ఎంగెల్స్ : "సమ్మె వల్ల ఉపయోగం ఏమీ వుండదని తెలిసి కూడా కార్మికులు సమ్మెకు ఎందుకు పూనుకుంటారని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఎందుకంటే, అది తప్పనిసరి. యజమానులు చేసే ప్రతి తగ్గింపుకూ కార్మికులు నిరసన తెలిపి తీరాలి. 'మనుషులుగా మేము ప్రస్తుత సామాజిక పరిస్థితులకే లొంగి జీవించడం కాదు, ఈ సామాజిక పరిస్థితులే మేము మనుషులుగా బతకడానికి వీలుగా మారాలి' అని కార్మికులు ఆశిస్తారు. వారు, ఏ నిరసనా లేకుండా నిశ్శబ్ధంగా వుండిపోతే, 'యజమానులు తమ మంచి కాలంలో కార్మికులను దోచుకోవడానికి, సంక్షోభం రోజుల్లో వారిని ఆకలితో మాడమని వదిలేయడానికి, యజమానుల వర్గానికి హక్కు వుంది'- అని కార్మికులు అంగీకరించినట్లే అవుతుంది. కార్మికులు, జంతువులుగా గాక మనుషులుగా జీవించాలనే ఆశను పూర్తిగా కోల్పోనంతవరకూ, యజమానుల విధానాలకు వ్యతిరేకంగా తిరగబడుతూనే వుండాలి...........
• పేదల్ని, పేదలుగానే ఉంచి, వారి శ్రమల్ని దోచుకుంటూ, ఆ పేదలకు కొన్ని ఉచితాలు ఇవ్వడం అంటే, అది శ్రామికులకు బిచ్చాలు పడెయ్యడమే! ఈ బిచ్చాలు, తమ శ్రమ విలువల్లో భాగాలే - అని తెలియక, అవి ఉచితంగా దొరికినట్టు ప్రజలు సంతోషిస్తారు. ఇది, శ్రామికుల్ని మోసగించే సంస్కరణవాదం.
• డ్రై మరుగు దొడ్లలో, చేతుల తోనే మలాన్ని ఎత్తే క్రూరమైన మురికి పనులు పాకీ వృత్తి కూలీలు చేస్తూ ఉంటే, 'స్వచ్ఛ భారత్' ప్రచార కర్తలు, ఏ పాకీ దొడ్డినైనా తమ చేతులతో శుభ్రం చేశారా, చేస్తారా? డ్రైనేజి గొట్టాల నించి మల మూత్రాలతో, పూడి పోతూ పోయే కందకాల్లోకి దిగి, గొట్టాల్లో పూడికల్ని తీసే పనుల్లో, గాలి అందక ప్రాణాలే పోగొట్టుకునే దుర్భర ఘట్టాల్లో ఈ ప్రముఖులెప్పుడైనా పాల్గొన్నారా, పాల్గొంటారా?
• శ్రామిక జనాలు క్షీణించి పోకుండా ఉండాలంటే, ఆర్థిక సంక్షోభాలకు కారణాలనూ, పరిష్కారాన్ని వివరించే సిద్ధాంతాన్ని వారు తెలుసుకోవాలి.
• నిర్జీవమైన గుళ్ళ, గోపురాలకీ లక్షల నిధులు. సజీవులైన కార్మిక మానవులకి తిట్లు, 'అన్నం అరక్క', 'బుద్ధిలేని' 'పనికి మాలిన' అంటూ! అమ్మవారికీ, శ్రీవారికీ ముక్కు పుడకలూ, కిరీటాలూ, అన్నీ పన్నుల రూపంలో వచ్చిన కార్మికుల అదనపు విలువే.
