-
-
మ్యాజిక్ ఫోటోషాప్
Magic Photoshop
Author: Nalla Sai reddy
Publisher: Self Published on Kinige
Pages: 40Language: Telugu
గ్రాఫిక్స్... గ్రాఫిక్స్... గ్రాఫిక్స్... ప్రతీచోట ఈ మాట కొత్తగా ఎంటరయింది. ఎలక్ట్రానిక్_ ప్రింట్ మీడియాలో విరివిగా వాడుతున్న ఈ గ్రాఫిక్స్ ఎక్కువ మొత్తంలో ఉందంటే ఆశ్చర్యం లేనే లేదు. పేపర్లో గ్రాఫిక్స్, సినిమాలో గ్రాఫిక్స్, ప్రకటనల్లో గ్రాఫిక్స్, చానల్లో గ్రాఫిక్స్... ఇలా చెపుకుంటూ పోతే... హా...
ఫోటోషాప్ అనేది ఫోటోగ్రాఫిక్స్ సాఫ్ట్వేర్... ఇది ఫోటోను కావాల్సిన విధంగా గ్రాఫిక్స్ చేసుకోవడానికి వీలవుతుంది. ఫోటోషాప్ మొదలుపెట్టే విధానం నుండి మొదలు...
1. ఫోటోషాప్ బేసిక్ విండో
2. టూల్ బాక్స్ కాంపోనెంట్స్
3. వాటర్ రిఫ్లెక్షన్ ఎఫెక్ట్
4. రెయిన్బో ఎఫెక్ట్
5. నైట్ లైట్ ఎఫెక్ట్
6. 3డి టెక్ట్స్ ఎఫెక్ట్
7. పెన్సిల్ ఔట్లైనింగ్
8. గ్రీటింగ్స్ కంపోజ్
9. మూన్ లైట్, ఫైర్ వర్కింగ్ ఎఫెక్ట్
10. వాటర్ & లైట్ ఎఫెక్టింగ్...
ఇలా స్టెప్ వైజ్ డీటేల్స్ తో సహా... 10 ఎఫెక్టులను వివరింపబడినాయి. సాధ్యమైనంత వరకు తెలుగు పదాలను వాడాలనే అనుకున్నా, మెనూలయందూ... ఆప్షన్లయందు కొన్నింటిని సౌకర్యం కోసం డైరెక్టుగా వాడాల్సివచ్చింది. ఫోటోషాప్ యందు తరువాత స్థాయిలో వాడాల్సిన గ్రాఫిక్స్ ను అందించే ప్రయత్నం చేశాను.
ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రియపాఠకులు నేను మొదటిసారి ఫోటోషాప్ ట్రైనింగ్ పుస్తకాన్ని "మ్యాజిక్ ఫోటోషాప్” పేరుతో అందించిన ఈ పుస్తకాన్ని ఆదరిస్తారనీ ఆశిస్తాను.
- నల్లా సాయిరెడ్డి
