-
-
మధ్యయుగాల భారతదేశంలో టెక్నాలజీ - సి 650 - 1750
MadhyaYugala Bharatadesamlo Technology C 650 1750
Author: Irfan Habib
Pages: 112Language: Telugu
మధ్యయుగాలలో (650-1750) భారతదేశం సాంకేతికపరంగా ఎలా ఉండేది? ఆనాటి ఉత్పత్తి ప్రక్రియలో ఎలాంటి పనిముట్లు వాడారు? భారతదేశంలో జరిగిన నూతన ఆవిష్కరణలు ఏమన్నా ఉన్నాయా? దేశ విదేశీ సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఆయా వృత్తులు కళలు ఎలా ప్రభావితం అయ్యాయి? విదేశాలలో కనుగొన్న కొన్ని రకాల ఉత్పత్తులు, పనిముట్లు, సాధనాలు, విధానాలు ఎందుకు ఇక్కడ వాడుకలోకి రాలేదు? ఇండియాలో ఆనాడు యూరపులో వలే, ఇంకా ఇతర దేశాలలో వలే యాంత్రిక పరిజ్ఞానం ఎందుకు అభివృద్ధి చెందలేకపోయింది?... ఇత్యాది అనేక ప్రశ్నలకు సమాధానాలను ప్రఖ్యాయ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ ఈ టెక్నాలజీ చరిత్ర గ్రంథంలో ఎంతో హేతుబద్ధంగా, ఆధారసహితంగా చర్చించి రాబట్టారు. అంతేకాదు, మధ్యయుగాల భారతదేశంలో టెక్నాలజీ అభివృద్ధి చెందకపోవడానికి ఆనాటి సామాజిక ఆర్థిక అంశాలు ఎలా ప్రతిబంధకంగా నిలిచాయన్న ముఖ్యమైన అంశంపై చివరి అధ్యాయంలో ఆయన చేసిన విశ్లేషణ ఈ చిన్న పుస్తకానికి మకుటాయమానం.

- ₹108
- ₹129.6
- ₹129.6
- ₹72
- ₹86.4
- ₹86.4