-
-
మధుపం రివైజ్డ్ ఎడిషన్
Madhupam Revised Edition
Author: Poodoori Raji Reddy
Publisher: Krishnakanth Prachuranalu
Pages: 159Language: Telugu
సెప్టెంబర్ 2009లో వెలువడిన "మధుపం - ఓ మగవాడి ఫీలింగ్స్" పుస్తకానికి ఇది రివైజ్డ్ ఎడిషన్ (సెప్టెంబర్ 2014).
* * *
ఇది మాయ అని తెలిసీ, గింజుకుంటూనే, ఇందులోంచి బయట పడట్లేదంటే.. ఈ మగాళ్ళని బాగు చేయడానికి ఏ మగాడు రావాలి!.
* * *
రాజిరెడ్డి స్త్రీని ప్రేమించే విధానం... రామదాసు శ్రీరాముడిని తిట్టినట్లు ఉంటుంది. రాజిరెడ్డి స్త్రీని ద్వేషించే విధానం... భక్తుడు దేవుడి కాళ్ళమీద పడినట్లు ఉంటుంది. నిజమైన స్త్రీకి, నిజమైన దేవుడికి తప్ప మిగతావాళ్ళకి రాజిరెడ్డి అందడు. వాడు మగాడు. మీసాలొచ్చాక రాజిరెడ్డి ముచ్చటపడి కుట్టించుకున్న మొదటి డ్రెస్... ఈ పుస్తకం.
- మాధవ్ శింగరాజు
* * *
స్త్రీల ప్రపంచంలోకి తొంగిచూసి, వాళ్ళ ఆలోచనల్నీ, మెళకువల్నీ దొంగిలించేసి, ఇలా తన కాలమ్స్‌లో రాజిరెడ్డి రాసేసుకున్నాడనిపిస్తోంది... మన గురించి మన జీవన సహచరుడు నిజాయితీగా మనసు లోతుల్లో ఏమనుకుంటున్నాడో అర్థం చేసుకోడానికి ఈ మాన్యువల్ ఎప్పుడైనా పనికొస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన పుస్తకాల్లో ఇది మస్ట్ రీడ్ బుక్.
- కల్పనా రెంటాల
'నేనెంత వెధవనో నాకు మాత్రమే తెలుసు'- అనుకుంటాడు నిజాయితీ గా తనను తను చూసుకునే మగాడు. లోపలి విషయాలన్నీ బయటికి చెప్పి...అయినా వీడు మంచోడే అనిపించేలా రాసిన మగానుబావుడు పూడూరి రాజిరెడ్డి. - వంగా రాజేంద్ర ప్రసాద్