-
-
మధు విలాస్
Madhu Vilas
Author: Mydhili Venkateswara Rao
Pages: 200Language: Telugu
భార్యంటే అమితమైన ఇష్టమున్న భర్త...
భర్తంటేనే భద్రకాళిగా మారే భార్య...
దేశంలో మగాళ్ళందరూ ఒకటే అనే భార్య కథ...
నాకు మాత్రమే ఇలాంటిది దొరికిందిరా అనే ఆ మొగుడు కథ. వెరసి....
అదే.... మీ చేతుల్లో వున్న ఈ ....
మధు విలాస్
ఇది మైథిలీ వెంకటేశ్వరరావు రచన.
* * *
సామంత్కి కొద్దిగా కుదుటపడింది. మరేం ఫర్వాలేదన్నాడు డాక్టర్.
మరుసటిరోజు అమ్మా నాన్న ప్రయాణం అవుతున్నారు.
''ఉంటానమ్మా...'' అంది చిన్నగా.
''ఇక్కడిలా వదిలిపెట్టి'' అంది సాహిత్య....
''మేము వుంటే మీకు ఇబ్బందే. ఇప్పటికే మీ అత్తగారు ఇంటికి హాస్పిటల్కి తిరగలేక అవస్థ పడుతోంది. అందుకని...''
సాహిత్య తల ఊపింది.
తల్లి ప్రవర్తన మింగుడు పడలేదు.
''అల్లుడిని జాగ్రత్తగా చూసుకో.... ఇలాంటి సమయాల్లో భార్య భర్తకి, భర్త భార్యకి పూర్తిగా అర్థమయ్యేది.''
సాహిత్య ఆ రోజు రాత్రి కళ్ళు తెరిచినపుడు సామంత్ అన్న మాటలు గుర్తు కొచ్చాయి.
''జీవితంలో ఏదో రోజు నిన్ను మారుస్తాను... అదే నా ఆఖరి రోజు కూడా... నన్ను విడిచిపెట్టకు... నిన్ను మరవలేను.''
అనాలోచితంగా చేతికేసి చూసుకుంది... తన చేతిని స్పృశిస్తూ అన్న మాటలు.... మరోసారి మారుమ్రోగాయి....
తనంటే అంత ప్రేమ వుందా?... తనని వదిలి వుండలేక పోతున్నాడా? అదే నిజమయితే ఇలాంటి స్థితిలో కూడా అతని కోసం పక్కనే వుండలనుకోలేదు తను... తను.. అతన్ని ఇష్టపడకపోయినా తాను అంతగా కోరుకుంటున్నాడా?

- ₹233.28
- ₹280.8
- ₹125.28
- ₹233.28
- ₹125.28
- ₹233.28