-
-
మదరాసు బదుకులు
Madarasu Badukulu
Author: Multiple Authors
Publisher: Self Published on Kinige
Pages: 291Language: Telugu
మదరాసు తెలుగు వారి జీవనబింబం
పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసింది మద్రాసుతో కూడిన తెలుగు రాష్ట్రం కావాలని! తమిళనాడు ప్రాంతంలో ఇప్పటికీ శ్రామిక కులాలలో అధిక సంఖ్యాకులు తెలుగువారే! నేడు తమిళనాడు లోని ప్రతి జిల్లాలోనూ అటువంటి ఐదు కులాల తెలుగువారు వ్యాపించి ఉన్నారు. సంఖ్యాపరంగా చూస్తే నేడు తమిళనాడుగా పిలవబడే ప్రాంతంలో నలభై శాతం మించి తెలుగువారున్నారు. ఈ విషయాలు మనకు పెద్దగా తెలియవు. వర్తమాన మదరాసు – తెలుగువారి జీవితాలను చిత్రించీ 36 కథల సంకలనం – మదరాసు బదుకులు. పలు కోణాలతో విశిష్టమైన ఈ కథల సంకలనం నేపథ్యం గురించి డా. నాగసూరి వేణుగోపాల్ వివరిస్తుండగా, భువనచంద్ర ఈ కథలను పరామర్శించారు. చెన్నపురి రచయితల సంఘం వెలువరించి, ఈ కథల కదంబానికి శ్రీ విరించి విలువైన ముందుమాట రాశారు. రాయదుర్గం విజయలక్ష్మి, జలంధర, జయదేవ్ బాబు, సరోజినీ ప్రేమ్ చంద్, భువనచంద్ర, శ్రీమతి రామనాథ్, ఆర్.ఎస్.హైమవతి, అద్దేపల్లి సుచిత్రాదేవి ఇత్యాదులు సృజించిన ఈ మదరాసు బదుకులు కథా సంకలనం చెన్నపురి తెలుగువారి జీవన ప్రతిబింబం.
- గొర్లి శ్రీనివాసరావు

- FREE
- FREE
- ₹180
- ₹270
- FREE
- FREE