-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
మా తెలుగు తల్లికి మల్లెపూదండ (free)
Maa Telugu Talliki Malle Pudanda - free
Author: Dr. V. Nagarajya Lakshmi
Publisher: Self Published on Kinige
Pages: 26Language: Telugu
“ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాలస్యతపసః ఫలమ్'' అని 'సుందర తెలుంగు' అని “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అని భాషేతరులచేత, పరదేశీయులచేత అమితమైన ప్రశంసలనందుకొని 'దేశభాషలలో ఉత్తమమైనదిగా నిలిచిన భాష తెలుగు. తెలుగు భాషను, తెలుగు నేలను, తల్లిగా భావించి పూజించటం తెలుగు వారి సంప్రదాయం. అజంతరూపమై, సంగీతానికి అనువైనదై తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయానికి సరిజోడుగా కీర్తిగన్నది తెలుగు భాష. తెలుగు తల్లి ఒడిలో ముద్దులొలికే అపురూపమైన శిల్పసందప, జాతికి ప్రాణం పోసే నదీనదాలు, కనులవిందు చేస్తాయి. శౌర్య, ధైర్య పరాక్రమాలతో, సంస్కృతి, సంప్రదాయాలతో, బుద్ధి వైశారద్యంతో, కమనీయ కవితలల్లగల ప్రతిభతో, భక్తి భావ గరిమతో విలసిల్లిన మహనీయులను, మహిళా శిరోమణులను కన్నతల్లి తెలుగు నేల. మధురమంజులమైన రూపురేఖలతో విరాజిల్లుతున్న తెలుగు తల్లికి, మల్లెల భావపరీమళాలతో కూడిన పూదండను నిండుగా అలంకరించిన వారు శ్రీ శంకరంబాడి సుందరాచార్యులు. “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” కీర్తన తెలుగు తల్లి వైభవానికి నిలువెత్తు కీర్తిసరం. ఆ కీర్తనలో సుందరాచారి గారు వర్ణించిన కృష్ణా, గోదావరీ నదీలలామలు, త్యాగయ్య, తిక్కన్నలు రుద్రమ్మ, మల్లమ్మలు, తిమ్మరుసు, కృష్ణరాయలు ఒకే వేదికపై ప్రత్యక్షమైతే అనే భావన ఈ రూపక రూపకల్పనకు ప్రేరణ నిచ్చింది.
- డా. వి. నాగరాజ్యలక్ష్మి

- FREE
- FREE
- FREE
- ₹86.4
- ₹162
- ₹135.6