• Maa Oori Nandula Atmiya Katha
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • మా ఊరి "నందుల" ఆత్మీయ కథ

    Maa Oori Nandula Atmiya Katha

    Pages: 118
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


" ఇప్పుడు మీ వయసెంత?” అన్నారాయన "
అరవై రెండు ” అన్నాన్నేను "
ఈ అరవై రెండేళ్ళలో మీరేం నేర్చుకున్నారు " అన్నారాయన.
ఆయన నాకు మంచి మిత్రుడు. నా కంటే దాదాపు ఇరవై సంవత్సరాలు చిన్నవాడు. సాంకేతిక విద్యలో నిపుణుడు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు. అక్కడే ఆచార్యులుగా పనిచేశారు. సాంకేతిక విద్యను, తాత్విక విద్యను సమంగా, సమగ్రంగా అధ్యయనం చేసిన మిత్రుడు. ఆ సమయంలో నేను కూడా సాంకేతిక కళాశాలలో పనిచేయడం తటస్థిచింది. ఇద్దరం మంచి మిత్రులమయ్యాం . కలసి భోజనం చేసే వాళ్ళం. కలసి ఆలొచించే వాళ్ళం. మేం తెచ్చుకున్న అన్నం, కూర, పప్పులు పంచుకునే వాళ్ళం. ఆయనే డాక్టర్ విశ్వనాధం. ఆ సాంకేతిక కళాశాలలో రీసర్చ్ డెవలప్మెంట్ డీన్‌గా పనిచేస్తున్నారు. ఆ రోజు నుండీ అదే ప్రశ్న నన్ను వెంటాడుతుంది. అవును ఈ అరవై రెండేళ్ళలో నేనేం నేర్చుకున్నాను?

అసలు నేర్చుకోవడం అంటే ఏమిటి ? నేర్చుకోవడం నిరంతరం కొనసాగుతూనే వుంటుందా? నేర్చుకోవడం అనేది పాఠశాలలోనే గోడల మధ్యన జరుగుతుందా? అది టైంటేబుల్ ప్రకారం జరుగుతుందా? సంకల్పం తోనే నేర్చుకుంటామా? అసంకల్పితంగా నేరుకుంటామా? నేర్చుకోవడం పుట్టుకతో ప్రారంభం అవుతుందా? లేక మాతృ గర్భం నుండే నేర్చుకుంటామా? ప్రహ్లాదుడు, అభిమన్యుడూ లాంటి వారు మాతృగర్భం నుండే నేర్చుకోవడం ప్రారంభించారు కదా? మరి పుట్టుక ముందే మానవ చేతనతో పుట్టినప్పుడు ఆ చేతనలోని అనేకానేక సంవత్సరముల మానవ చేతనలోని నేర్పులన్ని ఇందులో ఇమిడి వుంటాయా? “ పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాలలోపు ఎంత భాష మనిషి నేర్చుకుంటాడో తదుపరి జీవితమంతా అంత భాషను నేర్చుకుంటాడు - అంటుంది " మరియ మాంటిస్సోరి - మనిషి నేర్చుకోవడం అనేది తల్లితండ్రుల నుండి, పరిసరాల నుండీ సంభవిస్తుందా? పశుపక్షాదుల నుండీ , ప్రకృతి నుండీ కూడా మనిషి నేర్చుకుంటాడా? నేర్చుకోవడం అంటే కేవలం విషయ పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం మొదలైనవేనా? ఇవి కాక ఇంకా ఏం నేర్చుకుంటాడు మనిషి? ఏవేవి చేయాలో నేర్చుకుంటాడా? ఏం చేయకూడదో నేర్చుకుంటాడా? నేర్చుకోవడం ఆగిపోతుందా? లేక జీవితాంతం నేర్చుకుంటూనే వుంటాడా? పోలికలు, పోటీ తత్వం తోనే నేర్చుకుంటామా? నేర్చుకున్న దాన్ని సంపాదన మార్గంలో వాడుకోవడానికే నేర్చుకుంటామా? నేర్చుకున్నది సంపాదించి పెట్టలేనప్పుడు అ నేర్చుకోవడం వృధా అనుకుంటామా? ఏ పేరాశ, దురాశా లేకుండా నేర్చుకుంటామా? వంశపారంపర్యంగా వచ్చిన నిపుణతలు సంపాదించి పెట్టలేనపుడు అది దండగ అనుకుంటూ వుంటామా?

నేనేం నేర్చుకున్నానని నన్ను నేను ప్రశ్నించుకునేప్పుడు ఒక్కసారి జీవిత పుస్తకాన్ని వెనక్కు తిప్పాల్సి వచ్చింది. నా మొదటి పదహారు సంవత్సరాలు ఎలా గడిచింది, ఎలా ఏమి నేర్చుకున్నామన్న విషయాలన్నీ ఒక్కసారి మననం చేసుకుంటా .....

- నందుల ప్రభాకర్ శాస్త్రి

Preview download free pdf of this Telugu book is available at Maa Oori Nandula Atmiya Katha